Wednesday, November 30, 2022

బాదముల చక్కదనంతో సంక్రాంతి పండుగను వేడుక చేసుకోండి!

- Advertisement -

హైదరాబాద్: శీతాకాలపు ముగింపు, నూతన పంటల సీజన్‌ ప్రారంభానికి ప్రతీకగా మకర సంక్రాంతి పండుగను అత్యంత ఆనందంగా జరుపుకుంటుంటారు. అత్యంత ఆనందసందోహాలతో జరుపుకునే ఈ పండుగను దేశవ్యాప్తంగా విభిన్నమైన పేర్లతో పలు రాష్ట్రాలలో జరుపుకుంటుంటారు. పేర్లు వేరైనా పండుగ స్ఫూర్తి మాత్రం ఒకటే ! ఉదాహరణకు, దీనిని మఘీ మరియు లోహ్రీ అని ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు. మాఘ్‌ బిహు అని ఈశాన్య రాష్ట్రాలలో వేడుక చేసుకుంటే, పశ్చిమ భారతదేశంలో ఉత్తరాయణ్‌ అని, దక్షిణ భారతదేశంలో పొంగల్‌ అని, తూర్పు భారతదేశంలో మకర సంక్రాంతి అని వేడుక చేసుకుంటారు. నూతన పంటలు బాగా పండాలని కోరుకుంటూనే ప్రకృతికి ధన్యవాదములు తెలిపే మార్గం మకర సంక్రాంతి.

పండుగలు మరియు వేడుకలు ఏవైనా దేశవ్యాప్తంగా ప్రజలందరూ మాత్రం వైవిధ్యమైన ఆహారం, సంప్రదాయ స్వీట్లు మరియు రుచులులో మునిగిపోతుంటారు. కానీ ఈ సందర్భం మాత్రం మీ ఆహారపు అలవాట్లను మరింత ఆలోచనాత్మకంగా మార్చుకునే అవకాశంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ తరహా పండుగలలో జరిగే కుటుంబ సమావేశాలలో మనం తీసుకునే ఆహారపదార్థాలు కొంత అనారోగ్యం కలిగించవచ్చు. అలా జరుగకుండా ఉండాలంటే బాదం వంటి ముడి, రుచికరమైన లేదా సాల్టెడ్‌ నట్స్‌ను సాధారణ తియ్యందనాలలో భాగంగా చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అందువల్ల, ఈ సీజన్‌ను అనారోగ్యకరమైన వేపుళ్లు మరియు స్వీట్లును తినడం తగ్గించుకోవడంతో పాటుగా గుప్పెడు ముడి, ఫ్లేవర్డ్‌ లేదా సాల్టెడ్‌ ఆల్మండ్స్‌ను తినడం అలవాటుగా మార్చుకోండి.

చక్కటి ఆరోగ్య బహుమతిగా బాదములు నిలుస్తాయి. మీరు తినడమే కాదు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా బహుమతిగా అందించవచ్చు. బాదములు లాంటి గింజలలో మెగ్నీషియం,రాగి, డైటరీ ఫైబర్‌తో పాటుగా రోగ నిరోధక శక్తి పెంపొందించే యాంటీ ఆక్సిడెంట్‌ విటమిన్‌ ఈ కూడా ఉంటుంది. బాదములు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, బ్లడ్‌ షుగర్‌ నియంత్రణలో ఉండటంతో పాటుగా ఆకలి కూడా తీరుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

పండుగ సమయాల్లో ఆలోచనాత్మకంగా తినాల్సిన ఆవశ్యకతను గురించి సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ ‘‘నా వరకూ మకర సంక్రాంతి లాంటి పండుగలంటే స్నేహితులు, కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అత్యుత్తమ సమయం. తియ్యందనాలలో మునిగిపోయేందుకు ఓ సహేతుక కారణంగా నిలుస్తుంది. అయితే, నా ఆరోగ్య ఎంపికల పరంగా నేనెప్పుడూ హద్దు దాటలేదు. అందుకోసమే జంక్‌ఫుడ్‌ను ఎప్పుడూ టేబుల్‌పై చేర్చనివ్వను. దానికి బదులుగా ఓ గిన్నెడు బాదములు పక్కన పెట్టుకుంటాను. రోజంతా నీళ్లు తాగుతూనే ఉంటాను. అంతేకాదు, పండుగ స్వీట్లను కూడా ఆరోగ్యవంతంగా మలుచుకునేందుకు, మరింత పోషకాలతో నింపేందుకు బాదములు, బెల్లం లాంటివి జోడిస్తుంటాము’’అని అన్నారు.

సెలబ్రిటీ మాస్టర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, ఫిట్‌నెస్‌ నిపుణురాలు యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ ‘‘భారతదేశంలో పండుగ సమయంలో చిరుతిళ్లను అతిగా తినడం సర్వ సాధారణం. అయితే, జీవనశైలి ఎంపికలను ప్రతిబింబించడంతో పాటుగా మనం తినే ఆహారం లేదా స్నాక్స్‌ ఎంపికలో కూడా జాగ్రత్త వహించాలి. పండుగ స్నాక్స్‌ ఎప్పుడూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని నేను చెబుతుంటాను. ఈ రుచులకు తగిన పోషకాలను జోడించడం అవసరం. ప్రాసెస్డ్‌, నూనె ఎక్కువగా ఉన్న లేదా స్వీట్లను తినడానికి బదులుగా గుప్పెడు బాదములు తినడం ఆరోగ్యవంతమైన ఎంపిక. బాదమలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి మరియు భోజనాల నడుమ ఆకలినీ తీరుస్తాయి’’ అని అన్నారు.

న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ‘‘ పండుగ సమయాలలో ఎంతోమంది తమ ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లను పక్కన పెడుతుంటారు. ఈ సమయంలో తినే ఆహారం కారణంగా అవాంచిత బరువు పెరిగే సమస్య కూడా ఉత్పన్నమవుతుంటుంది. అందవల్ల మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉన్నప్పుడు ఏదైనా తినాలనుకుంటే, బాదములు లాంటి నట్స్‌ను దగ్గర ఉంచుకోండి. ఆకలిని దూరంగా ఉంచుకునేందుకు బాదములు ఎంతగానో తోడ్పడతాయి. ఈ ఆరోగ్యవంతమైన, పోషకాల గనిలాంటి బాదమలు చక్కటి ఆరోగ్యం అందిస్తాయి. అదనంగా, బాదములలో రాగి, తగిన పరిమాణంలో జింక్‌ ఉంది. అవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి’’అని అన్నారు.

ఈ పండుగ రుచులలో లీనమైనప్పుడు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోవడం అతి సాధారణంగా కనబడుతుంది. అందువల్ల, మీ ఆహారపు అలవాట్ల పట్ల క్రమశిక్షణతో ఉండటం ఆవశ్యం. చిన్నదే అయినప్పటికీ అర్థవంతమైన మార్పులను చేసుకుంటే అత్యుత్తమ జీవితం ఆస్వాదించడంలో ఎంతగానో అది తోడ్పడుతుంది. అందువల్ల, బాదములు లాంటి ఆరోగ్య ప్రత్యామ్నాయాలను ఈ పండుగ సీజన్‌లో చేసుకోవడం మంచిది.

 

Related Articles

- Advertisement -

Latest Articles