Saturday, April 20, 2024

ఈ ఏడాది 10 లక్షల అమెరికా వీసాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ ఏడాది పదిలక్షల మంది భారతీయులకు అమెరికా వీసాలు జారీచేస్తారు. ఈ లక్షాన్ని ఛేదించేందుకు భారతదేశంలోని అమెరికా ఎంబస్సీలో అదనపు సిబ్బందిని నియమిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఇప్పుడున్న డ్రాప్ బాక్స్ ఏర్పాట్ల సౌకర్యాలను మరింతగా పెంచుతారు. ఈ వారాంతంలో వీసాలకోసం ఇంటర్వూల స్లాట్లు ఆరంభం అవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే ఇక్కడి అమెరికా దౌత్యకార్యాలయం ద్వారా రెండులక్షలకు పైగా వీసా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. తొలిసారిగా అమెరికా వీసాల కోసం దరఖాస్తులు చేసుకునే వారి కోసం ఈ జనవరిలోనే అమెరికా ఎంబస్సీ ప్రత్యేక ఇంటర్వూల స్లాట్లను శనివారం రోజున కూడా ఏర్పాటు చేసింది. దీని వల్ల దరఖాస్తుల పరిశీలన మరింత వేగవంతానికి వీలవుతుందని భావిస్తున్నారు.

ఈ ఏడాది మొత్తం మీద పదిలక్షల మంది భారతీయులకు వీసాల మంజూరుకు నిర్ణయించినట్లు, ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టినట్లు అమెరికా వీసా విభాగం అధికార ప్రతినిధి ఒక్కరు తెలిపారు. అమెరికా దౌత్యకార్యాలయ సంబంధిత కాన్సులేట్ కార్యాలయాలు ఢిల్లీతో పాటు ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాలలో ఉన్నాయి. సంబంధిత కార్యాలయాల్లో సిబ్బందిని తగు విధంగా పెంచారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ ఆ తరువాతి లాక్‌డౌన్ల నడుమ వీసా దరఖాస్తుల ప్రాసిసింగ్‌లో జాప్యాలు ఏర్పడ్డాయి. దీనితో నెలకొన్న బ్యాక్‌లాగ్ సమస్యను పరిష్కరించడం అనుకున్న విధంగా పది లక్షల వీసాల జారీకి వీలు కల్పించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News