Thursday, May 2, 2024

పదేళ్ల కుర్రాడు.. సైక్లింగ్‌లో మొనగాడు

- Advertisement -
- Advertisement -
10-year-old boy riding a bicycle
చిన్న వయస్సులోనే జాతీయ, రాష్ట్ర స్థాయి బహుమతులు
ప్రముఖులచే ప్రశంసలు అందుకుంటున్న శశాంక్ రెడ్డి
జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ గెలుపే..
లక్ష్యం అంటున్న చిచ్చర పిడుగు శశాంక్ రెడ్డి

మన తెలంగాణ/ముషీరాబాద్: కరోనా కాలం అందరి జీవితాల్లో కష్టాలను పలకరిస్తే.. ఈ కుర్రోడు జీవితానికి తన లక్ష్యాన్ని నిర్థేశించుకునేలా చేసింది. లాక్‌డౌన్‌తో ప్రతి ఒక్కరూ మోబైల్ ఫోన్లకు అతుక్కుపోతే, ఇతను మాత్రం తన భవిష్యత్తుకు పనికొచ్చే వాటిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాడు. ఫలితంగా తననెంతో ఆకట్టుకున్న సైక్లింగ్‌పై ఆసక్తిని పెంచుకున్నాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా సాధన చేసి రెండేళ్ల సమయంలోనే జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో బహుమతులను సొంతం చేసుకుంటూ, ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.

యూట్యూబ్ ద్వారా అవగాహన..

రాంనగర్‌కు చెందిన శశాంక్ రెడ్డి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మూర్తి జీవన్‌రెడ్డి, శ్రావణి దంపతుల కుమారుడు. ప్రస్తుతం ఐదో తరగతిచదువుతున్నాడు. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ తో యూట్యూబ్ లో విడియోలు చూస్తూ సైక్లిలింగ్ పట్ల మక్కువ పెంచుకున్నాడు. తన అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు తనయుడి ముచ్చట తీర్చడం కోసం ప్రాథమికంగా సైక్లిలింగ్ ప్రాక్టీస్ చేయడానికి ప్రత్యేక సైకిల్‌ను బహుమతిగా అందించారు. సైక్లిలింగ్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని యూట్యూబ్ ద్వారానే అవగాహన చేసుకుంటూ పొద్దున్నే 5 గంటలకు నిద్రలేచి తండ్రి జీవన్‌రెడ్డి సహాకారంతో శశాంక్ 8 ఏళ్లకే సైక్లిలింగ్ సాధన ప్రారంభించాడు.

ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా..

ఓయూలోని సైక్లిలింగ్ శిక్షణ అందించే వెలోడ్రమ్ ఆవరణకు తండ్రి తీసుకెళ్లి కోచ్‌లు విజయ్ భాస్కర్ రెడ్డి, మాక్స్‌వెల్ లను పరిచయం చేసుకున్నారు. శశాంక్ అభిరుచిని గుర్తించిన కోచ్‌లు సైక్లింగ్ చేసేవాళ్లు పాటించాల్సిన జాగ్రత్తలు, కఠోరమైన ఆహార నియమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అప్పటికే 8 ఏళ్లు మాత్రమే నిండిన శశాంక్‌ను సైక్లిలింగ్ క్రీడలో రాణించేందుకు ఇదే సరైన సమయమని కోచ్‌లు సలహా ఇచ్చి వెన్నుతట్టారు. మరింత రెట్టింపు ఉత్సాహాంతో చిన్నతనంలో అమితంగా ఇష్టపడే చాక్లెట్లు, షుగర్ స్వీట్స్, బర్గర్, చిప్స్ వంటి తినుబండారాలకు ఎనిమిదేళ్లకే దూరం కావాల్సి వచ్చింది. కోచ్‌లు అందించిన సూచనలతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, కుమారుడిని తన లక్షం వైపు నడిపించేందుకు తల్లిదండ్రులు ఖరీదైన ట్రాక్ షూట్, సైకిల్‌ను కొనుగోలు చేసి శశాంక్ పూర్తి స్థాయి శిక్షణ ఆరంభించేలా ప్రోత్సహాన్ని, స్ఫూర్తిని నింపారు.

జాతీయ, రాష్ట్ర స్థాయిలలో పతకాలు..

సైక్లిలింగ్ పోటీల్లో పాల్గొనడానికి 13 ఏళ్ల నుంచే అనుమతించేలా నిబంధనలున్నా.. మాక్స్‌వెల్ ట్రావెలర్ సైక్లింగ్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో 8 నుంచి 13 ఏళ్ల విభాగం వారికి నిర్వహించిన నేషనల్ సైక్లింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుని వెండి పతకం సాధించాడు. ఆ తర్వాత స్పోర్ట్ డే పురస్కరించుకుని హైదరాబాద్ స్పోర్ట్ అథారిటీ నిర్వహించిన పోటీల్లో గెలుపొంది హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శర్మన్, సైక్లింగ్ ఫెడరేషన్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఇంకా మరెన్నో ఈవెంట్స్‌లలో పాల్గొంటూ బహుమతులను సొంతం చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా శశాంక్ మనతెలంగాణతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో చాంపియన్‌షిప్ సాధించడమే తన లక్షం అంటున్నాడు. సైక్లిలింగ్ ఖరీదైన క్రీడ కావడంతో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందంటూ తండ్రి జీవన్‌రెడ్డి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News