Friday, April 26, 2024

మార్చిలో అందుబాటులోకి బహదూర్‌పుర ప్లైఓవర్

- Advertisement -
- Advertisement -
Bahadurpura flyover available in March
ఫ్లైఓవర్లతో సాఫీగా ప్రయాణం
రూ. 69 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ నిర్మాణం
పనుల్లో వేగంగా పెంచిన అధికారులు

హైదరాబాద్: నగరవాసులకు మరో ప్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. దీంతో నగరంలో ప్రయాణం మరింత సుఖవంతం కానుంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పూర్తిగా అధిగమించేందకు గాను అవసరమైన చోట ప్రాధాన్యత క్రమంలో ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టు ద్వారా సుమారు రూ. 8 వేల కోట్ల వ్యయంతో రోడ్ల అభివృద్ధ్ది, ప్లైఓవర్లు అండర్ పాస్‌లు ఫ్లైఓవర్‌లు, ఆర్.ఓ.బిలు చేపట్టిన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా బహదూర్‌పుర వద్ద చేపట్టిన ప్లైఓవర్ మార్చి చివరినాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిహెచ్‌ఎంసి కసరత్తు చేస్తున్నారు. రూ. 69 కోట్ల వ్యయంతో చేపట్టిన బహదూర్ పుర ఫ్లైఓవర్‌తో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ వ్యవస్థ మరింత మెరుగు పడుతుంది. అంతేకాకుండా ప్రయాణ సమయం తగ్గడం, ప్రయాణం సాఫీగా ముందకు సాగడం ద్వారా ఆయిల్ వినియోగం తగ్గి వాహనదారులకు ఇంధనం ఖర్చు సైతం కలిసిరానుంది.

ఎల్‌బినగర్ టూ ఆరాం ఘర్ ట్రాఫిక్ రహిత ప్రయాణం

గతంలో (పడమర నుండి తూర్పు)దిక్కు శంషాబాద్ నుండి ఆరాంఘర్ మీదుగా ఎల్.బి నగర్ ద్వారా యాదాద్రి, ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక్కప్పుడు జంక్షన్ల రద్దీతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు పడేవారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డిపి ) చేపడుతున్న పలు రోడ్డు అభివృద్ధి కి పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో ఈ మార్గం ప్రయాణం అత్యంత సులభతరం కావడమే కాకుండా సుఖవంతమైంది. అంతేకాకుండా పాత బస్తీ ప్రాంతంలో కూడా సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ మెరుగు పడుతుంది. ఈ మార్గంలో ఇప్పటికే అబ్దుల్ కలాంఫ్లైఓవర్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగా, .బహదూర్ పుర ఫ్లైఓవర్ ను మార్చిలో ప్రారంభించనున్నారు. ఈ ఆరు లైన్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కు 24 పిల్లర్లు పూర్తయ్యాయి. రెండు సైడ్ లో సర్వీస్ రోడ్డు నీటి నిల్వ కాకుండా మురుగు కాలువ నిర్మాణాలు చేపట్టారు. ఈ ఫ్లైఓవర్ వలన ఆరాంఘర్ నుండి ఎల్.బి నగర్ వరకు, పాత బస్తీ నుండి వచ్చే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ రద్దీ లేకుండా సులువుగా ఉంటుంది. బహదూర్ పుర, అబ్దుల్ కలాం, ఫ్లైఓవర్ పూర్తి కాగా రాంఘర్ నుండి జూపార్కు వరకు బైరమల్ గూడ ఫ్లైఓవర్ బ్రిడ్జి లు పూర్తయితే పాత బస్తీ వైపు మరింత అభివృద్ధి చెందే అవకాశం కలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News