Tuesday, April 23, 2024

త్వరలో ఆర్టీసి వరంగల్ రీజయన్‌లో 132 ఎలక్ట్రిక్ బస్సులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్టీసి వరంగల్ రీజియన్‌కు త్వరలో 132 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్ కార్యాలయంలో ఇటీవలే సమీక్ష నిర్వహించారు. రీజియన్ పరిధిలోని పలు డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడపాల్సిన రూట్లు, సాధ్యాసాధ్యాల గురించి అధికారులు చర్చించారు. బస్ డిపోల్లో ఫాస్ట్ చార్జీంగ్ పాయింట్లతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నారు.

ఈ బస్సులకు సంబంధించి పలు బస్‌డిపోల వద్ద ఫాస్ట్ ఛార్జీంగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో 132 ఎలక్ట్రిక్ బస్సులను ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 41 సీట్లతో ఈ బస్సులు అందుబాటులోకి రానుండగా ఒక్కసారి ఛార్జీంగ్ చేస్తే 325 కిలోమీటర్లకు పైగా ఈ బస్సులు ప్రయాణించనున్నాయి. ప్రయాణికుల భద్రత నిమిత్తం బస్సులో కనీసం మూడు సిసి టివి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సిసిటివి కెమెరాలను టిఎస్ ఆర్టీసి కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News