Wednesday, May 1, 2024

నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాకు పంపిస్తున్న నిందితులు
రూ.5.5 కోట్ల విలువైన 14.2కిలోల సూడోఎపిడ్రిన్ స్వాధీనం
మత్తు గోలీలు విక్రయిస్తున్న వారిని అరెస్టు చేసిన ఆసిఫ్‌నగర్ పోలీసులు
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్

మనతెలంగాణ, సిటిబ్యూరో: కొరియర్‌లో విదేశాలకు తరలిస్తున్న డ్రగ్స్‌ను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అలాగే మత్తు గోలీలను విక్రయిస్తున్న వారిని ఆసిఫ్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. రెండు కేసుల్లో నగర పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకున్నారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 14.2 కిలోల నిషేధిత సూడోఎపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.5.5 కోట్లు ఉంటుంది. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కొరియర్ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్‌ను తరలిస్తున్నారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్‌ఐ) అధికారులు నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు బేగంపేటలోని ఇంటర్నేషనల్ కొరియర్ ఏజెన్సీలో తనిఖీలు చేశారు. ఫొటో ఫ్రేమ్స్‌లో డ్రగ్స్ పెట్టి ప్యాకింగ్ చేసి ఆస్ట్రేలియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు తనిఖీలు చేసి 22 ఫ్రేమ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ చేసేందుకు నిందితులు హైదరాబాద్‌కు చెందిన అడ్రస్‌తో నకిలీ ఆధార్ కార్డు నంబర్‌ను ఉపయోగించినట్లు తెలిసింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు కొరియర్ చేసినట్లు తెలిసింది. సూడోఎపిడ్రిన్ కిలోకు రూ.40లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ ముఠా దేశంలోని వివిధ చెన్నై, ఢిల్లీ, బెంగళూరు నుంచి ఏడాది నుంచి 300కిలోలకుపైగా ఎగుమతి చెసినట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, డిఆర్‌ఐ అధికారులు, బేగంపేట పోలీసులు కలిసి పట్టుకున్నారు. డిసిపి కల్మేశ్వర్, ఇన్స్‌స్పెక్టర్లు శ్రీనివాస్, ముత్యంరాజు, సురేష్, ఎస్సైలు శ్రీనివాస్, పిసిలు సాయికుమార్ తదితరులు పట్టుకున్నారు. విలేకరుల సమావేశంలో జాయింట్ సిపి ఎఆర్ శ్రీనివాస్,డిసిపి కల్మేశ్వర్, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

ఆసిఫ్‌నగర్ పోలీసులు…

మత్తు గోలీలు విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ఆసిఫ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 50 మెతిలెనెడియోక్సి మెతంఫెటమిన్(ఎండిఎంఏ) స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని హయత్‌నగర్, ఆర్టిసి కాలనీకి చెందిన ధరావత్ సాయి చరణ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అమీర్‌పేటకు చెందిన రాచర్ల అంకిత్ బిబిఏ చదువుతున్నాడు. రాంచంద్రాపురానికి చెందిన బెల్లి అజయ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ముగ్గురు యువకులు కలిసి మత్తు ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి ఎక్కువ డబ్బులకు అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. మొబైల్ యాప్‌లో గ్రూపులను ఏర్పాటు చేసి ఒక గోలీని రూ.1,500 కొనుగోలు చేసి రూ.2,500 విక్రయిస్తున్నారు. మెహిదీపట్నం బస్టాప్ వద్ద కొందరు మత్తు ట్యాబ్లెట్లు విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో ఇన్స్‌స్పెక్టర్ రవీందర్ వెంటనే అక్కడికి సిబ్బందితో కలిసి వెళ్లి పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News