Friday, March 31, 2023

పోలీసుల నిర్భందంలో చిన్నోని పల్లి గ్రామం

- Advertisement -

గద్వాల: చిన్నోని పల్లి రిజర్వాయర్ రద్ధు కోరుతూ చిన్నోని పల్లి బోయల గుడెం,ఇందువాసి,చాగదొణ గ్రామాలకు చెందిన భూ నిర్వాసిత రైతులు 421వ రోజులుగా సమ్మె చేస్తుండగా 2 వేల 5వందల ఎకరాలు ముంపునకు గురికాగా 2005సం.లో ప్రభుత్వం2650 ఎకరాకు గుర్తించి ఎకరాకు రూ. 75వేలు భూములు కోల్పోయిన రైతులకు పరిహరం ప్రభుత్వం అందించింది. అధికారులు 90 శాతాం పనులు రిజర్వాయర్ పనులు పూర్తి కాగా 10 శాతం మిగిలిన పనుల కోసం శనివారం పోలీసులు కొంత మంది భూ నిర్వాసిత రైతులను అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు రాత్రి పోలీసులు 144 సెక్షన్ అమలు చెయ్యడంతో పాటు ఆదివారం మరో మారు వివిధ గ్రామాలకు చెందిన భూ నిర్వాసిత రైతులు రిజర్వాయర్ పనులను అడ్డుకుంటారని ముందుగానే 40 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లాలోని వివిధ స్టేషన్‌లకు తరలించారు.

అనంతరం అధికార యంత్రాంగం పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు రిజర్వాయర్‌కు జేసిబితో రిజర్వాయర్‌లో ఉన్న ముళ్ళ చెట్ల తొగింపు పనులను చేపట్టారు. గ్రామంలో పోలీసులు 144 సేక్షన్‌ను అమలు చేస్తున్నట్లు పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని నిర్భంధంలోకి తీసుకుంటుండడం పట్ల రైతులు అధికారుల తీరుపై విమర్శిస్తున్నారు.ప్రభుత్వ యంత్రాంగం తమకు పునరావాసాలు కల్పించక ముందే రిజర్వాయర్‌కు నివాళ్ళు వదిలేందుకు అధికారులు పనులు చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమే జీవనోపాధిగా బ్రతుకుతున్నామని ప్రభుత్వం తమ భూములకు చాలా తక్కువ పరిహరం చెల్లించిందని మార్కెట్ విలువల మేరకు తమ పొలాలకు 10లక్షల నుండి 20 లక్షల డిమాండ్ ఉందన్నారు.

2013 భూ సేకరణ చట్టా ప్రకారం తమకు పరిహరం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ శాంతియుతంగా పోరాటం చేస్తున్న మాపై ప్రభుత్వం పోలీసుల బలగాలతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.శనివారం పోలీసులు తమను నిర్భంధించి మండల రెవెన్యూ అధికారి ముందు సరేండర్ చేసి సంతకాలు చెయ్యాలని తమపై ఒత్తిడి తెచ్చారని దానిని మేము వ్యతిరేఖించామన్నారు. గట్టు పోలీస్టేషన్ నుండి రాత్రి తమను ఎక్కడికి తీసుకుని వేళుతున్నారనే సమాచారం లేకుండా వాహనంలో తిప్పుతూ పోలీసులు మా సేల్ ఫోల్‌లను లాక్కున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవరిస్తుందని అక్రమంగా అరేస్టు చేసిన నిర్భందించిన తమను వెంటనే విడుదల చేసి మార్కెట్ విలువల మేరకు తమకు పరిహరం చెల్లించి పునరావాసం కల్పించేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు.

పోరాటాన్ని కొనసాగిస్తాం ! ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరింస్తుందని పోలీసు బలగాలతో గ్రామాన్ని నిర్భంధించి తమని అరెస్టు చేసి నప్పటికి నిరసనను కొనసాగిస్తాము. అంతంపల్లి గ్రామ శివారులో తమకు ప్లాట్లు ఇచ్చారు కాని ఎలాంటి పునరావాసాలు కల్పించలేదని పునరావాసం కల్పించి తమకు ఇవ్వవలసిన పరిహరం చెల్లించేంత వరకు నిరసనను కొనసాగించి పనులను అడ్డుకుంటాము.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News