Saturday, April 27, 2024

కొత్తగా 17 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా 17 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 33 జిల్లాల్లో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకున్న ది. గత విద్యా సంవత్సరంలో 16 జిల్లాల్లో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ఏర్పా టు చేయగా మిగిలిన 17 జిల్లాల్లో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. కాగా పోడు భూముల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మే 23 నాటికి రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో ఇందుకోసం లక్షా 50 వేల 12 మంది లబ్దిదారులు పోడు భూముల కోసం క్లెయిమ్ చేసుకున్నారు. మొత్తం 4 లక్షల 5 వేల 601 ఎకరాల పోడు భూమి పంపిణీకి ఏర్పాట్లు జరిగాయి. కవాడీగూడాలో కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం కాపులు ప్రభుత్వానికి రూ. 10 కోట్ల ఆర్థికసాయం అడిగారు. ఇందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News