Tuesday, October 15, 2024

పెద్దఅంబర్‌పేటలో గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

పెద్ద అంబర్పేట్‌లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నిందితుల కదలికలను చాలా రోజులుగా గమనిస్తూ ఉన్నామన్నారు. పక్కా సమాచారంతో 170 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ముఠాలో ఎనిమిది మంది నిందితులు ఉన్నారని ఒడిస్సా రాష్ట్రం కోరాపుట్ ఇస్మాయిల్ తురుకి, మహారాష్ట్ర పూణే ఇందాపూర్ చెందిన మహమ్మద్ ఆసిస్ రాజన్, పోనీ హిందీ ఇందాపూర్ చెందిన శైలేంద్ర కారత్ ఇలియాస్ బంటి, సోలాపూర్ జిల్లా కర్మాన తాలూకా చికాతన్ గ్రామానికి చెందిన జీవన్ నానా నికిత్, ఇందాపూర్ కు చెందిన కేవల్ వినయ్ ముకురే, ఒడిస్సా మల్కాన్ గిరి లక్ష్మీనారాయణ భారీఖ్, మల్కాన్ గిరి జిల్లా మతిని గ్రామానికి చెందిన ధర్మరాజు దొర, అమర్ కలిసి గంజాయి రవాణా చేస్తున్నారు.

పట్టుబడ్డ వ్యాన్‌లో గంజాయి సరఫరా చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారన్నారు. గంజాయి తీసుకు వెళుతున్న వాహనానికి ముందు మరొక వాహనంతో ఎస్కార్ట్‌గా వచ్చారన్నారు. మల్కాన్ గిరి ప్రాంతంలో ఈ గంజాయిని ప్యాక్ చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారన్నారు. ఈ ముఠాలో ఇస్మాయిల్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు ఉన్నాడన్నారు. ప్రోక్లైన్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఇస్మాయిల్ తన పనిలో భాగంగా రాయపూర్‌లో పనిచేస్తున్న క్రమంలో సంతోష్ పరిచయం అయిందని, అతని ద్వారా గంజాయి సరిఫరాలోకి ఇస్మాయిల్ వచ్చాడని తెలిపారు. ఇస్మాయిల్ మహారాష్ట్రలో ఉండే సప్లయర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని మహారాష్ట్రకు గంజాయి సప్లై చేస్తున్నాడన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.34 లక్షలు ఉంటుందన్నారు. ఇస్మాయిల్‌పై గతంలో మహారాష్ట్రలో కేసు నమోద అయిందని. నాలుగు సంవత్సరాల జైలు శిక్ష కూడా అనుభవించాడన్నారు. ఈ కేసులో నిందితుల నేర చరిత్రను బట్టి పిడీ యాక్ట్ పెడతామని ఖరేషి వెల్లడించారు. హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ ప్రాంతంలో ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలి వెళ్తున్నటువంటి గంజాయి వాహనాన్ని స్టేట్ టాస్క్ ఫోర్స్ బీ టీం తుల శ్రీనివాసరావు బృందం పట్టుకున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News