Thursday, April 25, 2024

హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకు 18 శాతం ఓటర్లు ఓటేశారు !

- Advertisement -
- Advertisement -

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు శనివారం మొదలయ్యాయి. ఉదయం 11.30 వరకు 18 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 412 అభ్యర్థుల తలరాతను 50 లక్షలకు పైగా ఓటర్లు రాయబోతున్నారు. ఒకే దఫాలో 68 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలు జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని 7884 పోలింగ్ స్టేషన్‌లలో ఉదయం 5 గంటల నుంచే ఓటింగ్ మొదలయింది. కాగా వీటిలో 7235 పోలింగ్ స్టేషన్లు గ్రామీణ ప్రాంతంలో, 646 పోలింగ్ స్టేషన్లు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటికి తోడు మూడు అనుబంధ పోలింగ్(యాక్జిలరీ పోలింగ్) స్టేషన్లు ఉన్నాయి. హిమాచల్ ఎగువ ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. చంబ, కిన్నౌర్ ప్రాంతాల్లో మంచుకురుస్తోంది. లాహౌల్, స్పితి జిల్లాల్లో 140 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికలకు భద్రతను కట్టుదిట్టం చేశారు. 67 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సిఎపిఎఫ్), 25వేల రాష్ట్ర పోలీసు అధికారులు, జాతీయ విపత్తు, రాష్ట్ర విపత్తు దళాలకు చెందిన 800 మంది సిబ్బందిని నియుక్తించారు.

హిమాచల్‌లో మొత్తం 5592828 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2854945 మంది పురుషులు, 2737845 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో రూలింగ్ బిజెపి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకుంటోంది. 1982 నుంచి వస్తున్న ప్రత్యామ్నాయ (ఒక్కోసారి ఒక్కో) ప్రభుత్వ విధాన సంప్రదాయాన్ని తెంచాలనుకుంటోంది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఓటర్లకు 10 హామీలు ఇచ్చింది. వాటిలో పాత పింఛను పునరుద్ధరణ, 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ప్రతి గ్రామంలో మొబైల్ క్లినిక్కుల ద్వారా ఉచిత వైద్యం, 5లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు, మహిళలకు రూ. 1500 నెలవారీ సాయం తదితరులు గుప్పించింది. అరవింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ కూడా బరిలో పోటీపడుతోంది. ఇదివరలో 2017లో 68 సీట్లకు జరిగిన ఎన్నికల్లో బిజెపి 44, కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు డిసెంబర్ 8న జరుగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News