Friday, April 19, 2024

పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబంలో 20మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

కరాచీ: పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 20మంది మృత్యువాత పడగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 12మంది చిన్న పిల్లలుగా అధికారులు తెలిపారు. గురువారం రాత్రి భక్తులు వెళుతున్న వరద నీటితో నిండిన లోతైన గోతిలో పడిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. సూఫీల పవిత్రస్థలమైన షెహవాన్ షరీఫ్‌కు వెళుతుండగా దుర్ఘటన జరిగింది.

30 అడుగుల లోతున్న గోతిలోకి వ్యాన్ పడిపోయిందని, ఇటీవల సంభవించిన వరదల కారణంగా గోయి నీటితో నిండిపోవడం వల్ల ఎక్కువ మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతులు, క్షతగాత్రులు కుటుంబానికి చెందినవారని డిప్యూటీ కమిషనర్ ఫరిదుద్దీన్ ముస్తాఫా తెలిపినట్లు డాన్ వార్తాపత్రిక తెలిపింది. మార్గంలో బారికేడ్లును డ్రైవరు గమనించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ముస్తాఫా తెలిపారు. ప్రమాదంలో చనిపోయినవారిలో ఎనిమింది మంది మహిళలు, ఆరుగురు బాలికలు, మరో ఆరుగురు బాలురు ఉన్నారని వెల్లడించారు. కాగా ఈ దుర్ఘటనపై పాక్ మాజీ ప్రధాని అలీ జర్దారి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News