Saturday, April 27, 2024

కల్తీమద్యం కేసులో 20 కి చేరిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలను లక్షంగా చేసుకుని ఓటర్లను మత్తులో ముంచి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్న ముఠాను పంజాబ్ పోలీస్‌లు పట్టుకోగలిగారు. ఇంతవరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా ప్రమేయంతో కల్తీ మద్యం విక్రయాలు సాగి ప్రాణాంతకం కావడం, అనేక మంది తీవ్ర అస్వస్థులైన సంగతి తెలిసిందే . సంగ్రూర్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన సంఘటనలో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్యం శనివారం నాటికి 20 కు పెరిగింది. ఈ కేసులో ఇంతవరకు ఎనిమిది మందిని పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఈలోగా ఎలెక్షన్ కమిషన్ ఈ సంఘటనపై తక్షణం నివేదిక పంపాలని పంజాబ్ చీఫ్ సెక్రటరీని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని శనివారం ఆదేశించింది.ఈ విషాద సంఘటనపై దర్యాప్తు చేయడానికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఎడిజిపి) గురీందర్ సింగ్ థిల్లాన్ నేతృత్వంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (పాటియాలా రేంజ్) హరిచరణ్ భుల్లార్,

సంగ్రూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సర్టాజ్ చాహల్, అడిషనల్ కమిషనర్ నరేష్ దుబే తదితర నలుగురు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్టు అంతకు ముందు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన వెనుకనున్న కుట్రను సిట్ ఛేదిస్తుందని, ఎంతటివారు ఇందులో ఉన్నా ఉపేక్షించేది లేదని పోలీస్‌లు చెప్పారు.ఇప్పటికే డీర్బా సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ నాయకత్వంలో జిల్లా పాలనా యంత్రాంగం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కల్తీమద్యం బాధితుల్లో 11 మంది పాటియాలా లోని రాజీంద్ర ఆస్పత్రి లోను, మరో ఆరుగురు సంగ్రూర్ లోని సివిల్ ఆస్పత్రి లోను చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు 20 మంది చనిపోయారని సంగ్రూర్ సివిల్ సర్జన్ కీర్పాల్ సింగ్ శనివారం చెప్పారు. మృతులు డిర్బా, సునాం బ్లాక్‌ల్లోని గుజ్రాన్, టిబ్బిరవిదాస్‌పుర, ధండోలి ఖుర్ద్ గ్రామాలకు చెందిన వారుగా అధికారులు తెలిపారు.

అంతకు ముందు పోలీస్‌లు 200 లీటర్ల ఈథనాల్, లేబుళ్లతో కూడిన 156బాటిళ్ల ఆల్కహాల్, 130 బాటిళ్ల కల్తీమద్యం లేబుళ్లు లేని 80 బాటిళ్లు, ఖాళీగా ఉన్న 4500 బాటిళ్లు, బాటిలింగ్ మెషిన్‌ను స్వాధీనం ,చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలను లక్షంగా చేసుకుని కల్తీమద్యం అమ్మడానికి సిద్ధమౌతున్న ముఠాను పట్టుకుని గురువారం వరకు అరెస్టు చేయగలిగామని పోలీస్‌లు చెప్పారు. ఓటర్లను ఊరించి ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపించేందుకు ఈ ముఠా ప్రయత్నిస్తోందని పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News