Sunday, April 28, 2024

టి20 ప్రపంచకప్ బరిలో 20 జట్లు

- Advertisement -
- Advertisement -

దుబాయి: వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు ఖరారయ్యాయి. 2024లో జూన్ 4 నుంచి 30 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరుగనుంది. టోర్నీలో రికార్డు స్థాయిలో 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రపంచకప్‌లో మొత్తం 55 మ్యాచ్‌లు జరుగున్నాయి. ఇక లీగ్ దశతో పాటు సూపర్8, నాకౌట్ ఫార్మాట్‌లో పోటీలు జరుగుతాయి. అమెరికా, విండీస్‌లోని నగరాలకు వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. టి20 వరల్డ్‌కప్ 20 జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి. గతంలో 16 జట్లు బరిలోకి దిగాయి. ఈసారి మరో నాలుగు జట్లకు అవకాశం కల్పించారు. ఆతిథ్య జట్లు అమెరికా, విండీస్‌లు నేరుగా వరల్డ్‌కప్ బెర్త్‌లను దక్కించుకున్నాయి.

ఇక ర్యాంకింగ్ పద్ధతిలో ఇంగ్లండ్, పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లకు ఛాన్స్ దక్కింది. ఇక యూరప్ క్వాలిఫయర్ పోటీల ద్వారా స్కాట్లాండ్, ఐర్లాండ్ ప్రపంచకప్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాయి. ఇఎపి క్వాలిఫయర్ ద్వారా పపువా న్యూగినియా, అమెరికా క్వాలిఫయర్ ద్వారా కెనాడాలు అర్హతా సాధించాయి. ఆసియా క్వాలిఫయర్ టోర్నమెంట్ ద్వారా నేపాల్, ఒమన్‌లు బెర్త్‌లను దక్కించుకున్నాయి. ఇక ఆఫ్రికా తరఫున నమీబియా, ఉగాండాలు వరల్డ్‌కప్ బెర్త్‌లను సొంతం చేసుకున్నాయి. జింబాబ్వే, కెన్యా వంటి బలమైన జట్లను వెనక్కినెట్టి ఉగాండా, నమీబియాలు వరల్డ్‌కప్ అర్హత సాధించడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News