Saturday, July 27, 2024

పాక్ జైలు నుంచి 20 మంది తెలుగు మత్సకారులు విడుదల

- Advertisement -
- Advertisement -

లాహోర్: పాకిస్థాన్ జైలు నుంచి ఆదివారం 20 మంది భారతీయ మత్సకారులు విడుదలయ్యారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగువారు. వాఘా సరిహద్దు వద్ద పాక్ రేంజర్స్ వీరిని సోమవారం భారత సరిహద్దు భద్రతా సిబ్బందికి అప్పగించారు. సింధ్ ప్రావిన్సు లోని కరాచీ మలిర్ జిల్లా జైలు నుంచి విడుదలైన తరువాత వీరంతా రైలు ద్వారా లాహోర్ చేరుకున్నారు. లాహోర్ రైల్వేస్టేషన్ నుంచి వీరిని ఇధి ఫౌండేషన్ తీసుకొచ్చి నిన్న రాత్రి ఆశ్రయం కల్పించింది. విడుదలయ్యే ముందు మత్సకారుడు గిర్‌సోమనాధ్ మాట్లాడుతూ 2018 నవంబర్‌లో పాక్ సముద్ర జలాల్లో తాము ప్రవేశించిన కారణంగా పాక్ తీర రక్షణ బలగాలు అరెస్టు చేశాయని చెప్పారు. వీరంతా ఆరు నెలల జైలు శిక్ష పొందినప్పటికీ సరైన డాక్యుమెంట్ల నిర్ధారణ ప్రక్రియ కారణంగా విడుదల ఆలస్యమైందని, మలిర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ ఔరంగజీబ్ కాంగో చెప్పారు. పాకిస్థాన్ జైళ్లలో ఇంకా 200 మంది భారతీయ మత్సకారులు ఉన్నారని తెలిపారు.

20 Telugu fishermen released from Pak jail

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News