Sunday, June 16, 2024

నాందేడ్ లోక్‌సభ బరిలో 23 మంది

- Advertisement -
- Advertisement -

ఛత్రపతి సంభాజీనగర్: మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ నియోజవకర్గంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. నాందేడ్ స్థానానికి రెండవ దశ ఎన్నికలలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ జరగనున్నది. జూన్ 4న ఫిలితాలు వెలువడనున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు మొత్తం 66 మంది అభ్యర్థులు నాందేడ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 43 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చివరకు 23 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు.

ఈ స్థానం నుంచి బిజెపి తరఫున సిట్టింగ్ ఎంపి ప్రతాప్ పాటిల్ చిఖ్నీకర్, కాంగ్రెస్ తరఫున వసంత్‌రావు చవాన్, ప్రకాష్ అంబేద్కర్ సారథ్యంలోని వంచిత్ బహుజన్ అఘాడి నుంచి అవినాష్ భోసీకర్ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను బిజెపి అభ్యర్థి చిఖ్లికర్ ఓడించారు. అశోక్ చవాన్ ఇటీవలే బిజెపిలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. నాందేడ్ లోక్‌సభ పరిధిలో భోకర్, ఉత్తర నాందేడ్, నాందేడ్‌దక్షిణ, నయీగావ్, డేగ్లూర్, ముఖేడ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News