Tuesday, April 30, 2024

ధోనీని మించిన కెప్టెన్ లేడు

- Advertisement -
- Advertisement -

చెన్నై: టీమిండియా చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీకి మించిన కెప్టెన్ ఎవరూ లేరని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. కెప్టెన్‌గా ధోనీ భారత జట్టుపై తనదైన ముద్ర వేశాడన్నాడు. అతని రికార్డును అందుకోవడం ఇతర కెప్టెన్లకు సాధ్యం కాదన్నాడు. ధోనీ సారథ్యంలో భారత్ మూడు ఐసిసి ట్రోఫీలు సాధించిందన్నాడు. మరే భారత కెప్టెన్‌కు ఇలాంటి రికార్డు లేదన్నాడు. ఫార్మాట్ ఏదైనా జట్టును ముందుండి నడిపించడంలో ధోనీకి ఎవరూ సాటిరారన్నాడు.

2011 వన్డే ప్రపంచకప్‌తో పాటు టి20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీలలో భారత్‌ను విజేతగా నిలిపిన ఘనత ఒక్క ధోనీకి మాత్రమే దక్కిందన్నాడు. కపిల్ దేవ్ తర్వాత భారత్ వరల్డ్‌కప్ ట్రోఫీ అందించిన కెప్టెన్‌గా ధోనీ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడన్నాడు. రానున్న రోజుల్లో అతని రికార్డును బద్దలు కొట్టడం ఇతర కెప్టెన్లకు అంత సులువుకాదన్నాడు. భారత్‌కు లభించిన అత్యుత్తమ క్రికెటర్లలో ధోనీది ప్రత్యేక స్థానం అనడంలో ఎలాంటి సందేహం లేదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News