Saturday, April 27, 2024

తక్షణం కులగణన అమలు చేయాలి.. ముక్తకంఠంతో డిమాండ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కులగణనను అమలు చేయాలని బెంగళూరులో సమావేశమైన 26 ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. మైనారిటీలపై కొనసాగుతున్న విద్వేషాగ్ని, హింసకు వ్యతిరేకంగా పోరాడడం కోసమే తామంతా ఒకటయినట్లు కూడాఆ పార్టీలు స్పష్టం చేశాయి. అంతేకాదు రాజ్యాంగంలో పేర్కొన్న భారతీయ భావజాలాన్ని పరిరక్షించడం కోసం తాము నిరంతరం పోరాడుతామని కూడా రెండు రోజుల పాటు జరిగిన సమావేశం అనంతరం విడుదల చేసిన ‘సామూహిక్ సంకల్ప్’(ఉమ్మడి తీర్మానం)లో ఆ పార్టీలు స్పష్టం చేశాయి. ‘బిజెపి ఒక పద్ధతి ప్రకారం మన ప్రజాతంత్ర వ్యవస్థపై తీవ్రస్థాయిలో దాడి జరుగుతోంది. మన దేశ చరిత్రలో మనం కీలకమైన కూడలిలో ఉన్నాం.

భారత రాజ్యాంగానికి మూలస్తంభాలయినలౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్భౌమత్వం, సామాజిక న్యాయం, ఫెడరలిజంలను ఒక పద్ధతి ప్రకారం నాశనం చేస్తున్నారు’ అని ఆ పార్టీలు సంయుక్త తీర్మానంలో పేర్కొన్నాయి.‘ మైనారిటీలపైన జరుగుతున్న విద్వేషపూరిత దాడులను ఎదుర్కోవడానికి మనమంతా ఒక్కటి కావాలి. మహిళలు, దళితులు, ఆదివాసీలు, కశ్మీరీ పండిట్లపై పెరుగుతున్న దాడులను ఆపాలి. సామాజికంగా విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన వారందరి గోడును నిజాయితీగా వినాలి. ఇందులో మొదటి చర్యగా కులగణనను అమలు చేయాలి’ అని సమావేశంలో ముక్తకంఠంతో ఆమోదించిన తీర్మానంలో ఆ పార్టీలు స్పష్టం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News