Sunday, April 28, 2024

3 గంటల కరెంట్ కాదు… 24 గంటల కరెంట్ కావాలి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

మద్దూరు: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవసాయనికి 3 గంటల కరెంట్ చాలదా అనే నినాదాన్ని వ్యతిరేకిస్తూ దూల్మిట్ట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపిపి బద్దీపడగ కృష్ణ రెడ్డి,మండల అధ్యక్షుడు మంద యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి హాజరై మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు భారతదేశం ప్రజలు అంత తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారని అన్నారు.ఎదిగిన ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మిపథకం,గర్భిణులకు కెసిఆర్ కిట్,రైతులకు 24 గంటల విద్యుత్, రైతులకు నాణ్యమైన విత్తనాలు,రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతుబంధు, రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.

రైతులు ఏడాదికి మూడు పంటలు పండించేవిధంగా ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి సాగునీరు అందిచారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో నీరు లేక పంటలు పండక వర్షాల మీద ఆధారపడి పంటలు వేస్తే మంచి పంటచేతికి వచ్చే సమయానికి నీరు లేక ఎండిపోయేవి రైతు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు ఎన్నో జరిగాయన్నారు. కానీ నేడు నిండుగా నీరు ఏడాదికి 3 పంటలు పంట పండించుకునే విధంగా నీరు పుష్కలంగా ఉన్నాయన్నారు.ఇది చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలదా అనే మాటలు అనడం సరికాదని మండిపడ్డారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులు సరైన బుద్ధి చెప్పుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ సుంకరి మల్లేశం, పిఎసిఎస్ చైర్మన్ నాగిళ్ళ తిరుపతి రెడ్డి, సర్పంచులు కనకయ్య,అంజయ్య,ఎంపిటిసిలు నర్శింహులు,నాయకులు చొప్పరి సాగర్, దుబ్బుడు వేణుగోపాల్ రెడ్డి,భిక్షపతి,యూత్ అధ్యక్షుడు బడుగు సాయిలు,రైతులు కార్యకర్తలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News