Saturday, April 27, 2024

గజ్వేల్ లో 50 లక్షలు పట్టివేత

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గజ్వేల్ పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద రాత్రి 9 గంటలకు వాహన తనిఖీలలో  50 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఐపిఎస్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించడానికి
విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నామని,  టిఎసి 36 0198  అనే నంబర్ గల కారులో సోదాలు చేయగా 50 లక్షలు రూపాయలు దొరికాయని, డబ్బులకు ఆధారాలకు లేకపోవడంతో సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. రాయపోల్ గ్రామానికి చెందిన  బచ్చు రత్నాకార్ అనే వ్యక్తి తన కారులో డబ్బులు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ తనిఖీలలో గజ్వేల్ సిఐ సైదా, అడిషనల్ సిఐ ముత్యంరాజు, సిబ్బంది, కేంద్ర బలగాలు సిఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు 50 వేలకు మించి ఎవరు కూడా డబ్బులు వాహనాలలో తీసుకొని వెళ్లవద్దని అనురాధ సూచించారు. ఎక్కువ తీసుకొని వెళ్ళినచో తప్పకుండా దానికి సంబంధించిన పత్రాలు వెంబడి ఉంచుకోవాలని సూచించారు. లేకుంటే డబ్బులను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. డబ్బులను ఐటి శాఖకు అప్పగించడం జరుగుతుందని, కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గ్రీవెన్స్ కమిటీకి ద్వారా ఐటి శాఖకు అప్పగించడం జరుగుతుందన్నారు. సదరు బాధితుడు అక్కడికి వెళ్లి అధికారులకు డబ్బులకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు చూపించి విడుదల చేసుకోవచ్చని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News