Sunday, April 28, 2024

గతం గురించి ఆలోచన చేయను: శ్రేయస్ అయ్యర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కోల్‌కతాను రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడని ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపారు. గంభీర్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని, గతంలో ఇద్దరం కలిసి వేరే ఫ్రాంచైజీ కోసం పని చేశామని వివరించారు. ఐపిఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్-హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గాయం గురించి వైద్యులు అప్పుడు ఏం చెప్పారనే విషయం గురించి ఆలోచన చేయనని, ఇప్పుడు ఏం చేయాలనే దానిపై ఆలోచన దృష్టి పెట్టానని వివరించారు. గతం గురించి ఆలోచన చూస్తూ కూర్చోలేమని ప్రస్తుతం జరిగే దాని గురించి ఆలోచన చేయాలని తెలిపారు.

ఐపిఎల్‌లో చాలా సంవత్సరాల నుంచి ఆడుతున్నానని, ఇప్పుడు మాత్రం మరింత ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నానని, బ్యాటింగ్ లో సాధన చేస్తూ, భారీ షాట్లు ఆడడం కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఐపిఎల్‌లో తమ జట్టు విజేతగా నిలిపేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నామని, మా టీమ్‌లో ఆటగాళ్లు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తున్నారని, గత సీజన్లలో తమ ప్రదర్శన అంత గొప్పగా లేదని అయ్యర్ తెలిపారు. గత గురించి ఆలోచన చేయడం కంటే ఇప్పుడు ఏం చేయాలనే దానిపై కసరత్తు చేయడం మంచిదన్నారు. గతంలో నేర్చుకున్నది ఇప్పుడు అమలు చేస్తున్నానని, సాధన మీద దృష్టి పెట్టి, ఏదైనా పొరపాటు జరిగినా బాధపడను అని పేర్కొన్నారు. మిచెల్ స్టార్క్ జట్టులోకి రావడంతో బౌలింగ్ విభాగం పటిష్టంగా మారిందని, అత్యుత్తమ బౌలింగ్ వేయగల సమర్థుడు స్టార్క్ అని అయ్యర్ కొనియాడారు.

దేశవాలీ క్రికెట్‌లో ఆడకపోవడంతో బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను శ్రేయస్‌ను తొలగించింది. గాయం కారణంగానే ఆటకు దూరంగా ఉన్నానని అతడు వివరణ ఇచ్చినప్పటికి, ఎన్‌సిఎ వైద్య బృందం మాత్రం శ్రేయస్ ఫిట్‌గా ఉన్నాడని తెలిపడంతో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవలిసి వచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News