Tuesday, May 7, 2024

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగరంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. బుధవారం ఉదయం నగర శివార్ లోని పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్ద ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కంటెయినర్‌ను తనిఖీ చేయగా.. అందులో  370 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కంటెయినర్ ను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

370 Kg Ganja Seized in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News