Wednesday, November 6, 2024

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారత విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

5 Indian Students killed in Road Accident in Canada

టోరెంటో: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కెనడాలోని ఒంటారియో హైవేపై శనివారం ప్యాసెంజర్ వ్యాన్ ను ట్రాలీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారత విద్యార్థులు మృతి చెందగా… మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా తెలిపారు. సోమవాంర ఉదయం ట్వీటర్ లో మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

5 Indian Students killed in Road Accident in Canada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News