Wednesday, December 4, 2024

మలేషియా, ఫిలిప్పిన్స్ లో భారీ భూకంపం..

- Advertisement -
- Advertisement -

6.8 Magnitude Earthquake jolts Malaysia

కౌలాలంపూర్‌: మలేషియా, ఫిలిప్పిన్స్ లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపాలు సంభవించాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో తెల్లవారుజామున 2.39 గంటల సమయంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ ప్రకటించింది. రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. ఇక, ఫిలిప్పిన్స్ లోని మనీలాలకు 157 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 5.05 గంటల సమయంలో భూమి కంపించిందని.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.4గా నమోదైందని వెల్లడించింది. భూకంపాల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది.

6.8 Magnitude Earthquake jolts Malaysia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News