Monday, July 14, 2025

‘ఆపరేషన్ కలనేమి’.. 82 మంది ఫేక్ బాబాలు అరెస్టు

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఫేక్ బాబాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వారిని పట్టుకునేందుకు ‘ఆపరేషన్ కలనేమి‘ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లో భాగంగా సాధువుల వేషంలో ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలతో ఒక్క రోజే 34 మంది దొంగ బాబాలను పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. తాజా అరెస్టుతో ఈ ఆపరేషన్‌లో మొత్తం 82 మంది నకిలీ బాబాలను అరెస్టు చేసినట్లు చెప్పారు.

మతం ముసుగులో ప్రజా విశ్వాసాన్ని దోపిడీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సూచనల మేరకు గురువారం ఈ డ్రైవ్ ప్రారంభించినట్లు డెహ్రాడూన్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (SSP) అజయ్ సింగ్ తెలిపారు. పలు బృందాలను ఏర్పాటు చేసి.. ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న ఇటువంటి మోసగాళ్ల గురించి సమాచారం అందిన ప్రదేశాలలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదివారం అరెస్టు చేసిన 34 మందిలో 23 మంది ఇతర రాష్ట్రాల నివాసితులు ఉన్నారని ఆయన అన్నారు. గత మూడు రోజుల్లో, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 82 మంది వ్యక్తులను అరెస్టు చేసి.. వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సంబంధిత విభాగాల కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News