Saturday, December 14, 2024

ట్రక్కును ఢీకొన్న ఇన్నోవా కారు…ఆరుగురు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో మంగళవారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ట్రక్కు, ఇన్నోవా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఏడుగురు విద్యార్థులు ఉండగా, వారిలో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు దుర్మరణం పాలయ్యారు. వీరంతా అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టారు.

మృతులు గునీత్ (19), కామాక్షి(20), నవ్యగోయల్ (23), రిషబ్‌జైన్ (24), కునాల్ కుక్రేజా (23), అతుల్ అగర్వాల్ (24)గా గుర్తించారు. గాయపడిన మరో విద్యార్థి సిద్ధేశ్ అగర్వాల్ డెహ్రాడూన్‌కు చెందినట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో భీకరంగా ట్రక్కు ఢీకొనడంతో ఇన్నోవా ముక్కలైంది. కారును కట్ చేసి మృతదేహాలను వెలికి తీయాల్సి వచ్చింది. ట్రక్కు డ్రైవర్ అక్కడ నుంచి తప్పించుకున్నాడు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం డూన్ ఆస్పత్రికి పోలీస్‌లు పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News