Monday, December 2, 2024

ఫాం హౌస్ కేసు.. విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్‌లో జరిగిన పార్టీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. పార్టీలో పాల్గొన్న వారికి టెస్టులు చేయగా డ్రగ్స్ పాజిటివ్ గా తేలిన విజయ్ మద్దూరికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు విజ య్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. జన్వాడ ఫాం హౌస్ పార్టీలో పాల్గొన్న వారికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ రావటంతో మోకిల పోలీసులు ఎన్‌డిపిసి సెక్షన్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కెటిఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన జన్వాడ ఫాం హౌస్ పై పోలీసులు దీపావళి పండుగ సమయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ పెద్ద శబ్దాలు పెట్టి పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసు లు గుర్తించారు. విదేశీ మద్యం బాటిల్స్, కొన్ని మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీ సమయంలో అక్కడ కనిపించిన లిక్క ర్ బాటిల్స్ వీడియో, ఫొటోలు వైరల్ కావడం తెలిసిందే. ఆ పార్టీలో పాల్గొన్న వారికి టెస్టులు నిర్వహించగా విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ గా వచ్చినట్లు ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించారు. దాంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీ గెట్ టు గేదర్ పేరుతో డ్రగ్స్, మత్తు పదార్థాలు తీసుకోవడం ఏంటని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. పోలీసుల తనిఖీకి కొన్ని నిమిషాల ముందు కెటిఆర్ కుటుంబసభ్యులు సైతం అక్కడి నుంచి వెళ్లిపోయారని సైతం కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో విపరీతంగా ప్రచారం జరిగింది.

రేవంత్ ప్రభుత్వం మాత్రం డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని చెబుతోంది. ఇందులో ఎంత పెద్ద వాళ్లు ఉన్న వదిలిపెట్టేది లేదని, యువత జీవి తాలు నాశనం అవుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో రాజ్ పాకాలకు చెందిన ఫాంహౌస్‌లో జరిగిన పార్టీ రాజకీయాలకు కేంద్ర బిందువు అయింది. రాజ్ పాకాలకు మొదట విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. రెండు రోజులు కనిపించకుండా పోయిన రాజ్ పాకాల నిర్ణీత గడువు సమయానికి మోకిల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్ తో కలిసి పోలీసుస్టేషన్ కు వెళ్లిన రాజ్ పాకాల పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు జన్వా డ ఫాం హౌస్ కేసులో ఎ2గా ఉన్న విజయ్ మద్దూరి సైతం ఇటీవల విచారణకు హాజరయ్యారు. వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని, తెప్పిం చింది ఎవరు అనే కోణాల్లొ పోలీసులు విచారణ చేపట్టారు. రాజ్ పాకాల వాంగ్మూలం ఆధారంగానే ఆ తరువాత విచారణకు హాజరైన విజయ్ మద్దూరిని పోలీసులు విచారించారు. తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, తాను చెప్పని విషయాలను సైతం ఎఫ్‌ఐఆర్‌లో పొందు పరిచారని విచారణ అనంతరం విజయ్ మద్దూరి మీడియాకు వెల్లడించారు. దేశం విడిచి వెళ్లిపోకుండా ఉండేందుకు దర్యాప్తులో భాగంగా విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు సైతం పోలీసులు జారీ చేశారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News