Wednesday, December 4, 2024

మహారాష్ట్రలో బోల్తాపడిన ఎంఎస్‌ఆర్టీసీ బస్సు..9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించగా మరో 25 మంది గాయపడ్డారు. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో బస్సులో ప్రయాణిస్తున్న 9 మంది మరణించగా మరో 25 మంది ప్రయాణికులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సదకర్‌జుని తాలూకాలోని దవ్వా గ్రామం వద్ద అదుపు తప్పి బస్సు బోల్తాపడినట్లు వారు చెప్పారు. భండారా నుంచి గోండియా జిల్లాకు వెళుతున్న ఈ బస్సులో మొత్తం 36 మంది ప్రయాణిస్తున్నట్లు వారు చెప్పారు.

గాయపడిన ప్రయాణికులను వేర్వేరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా,,బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మృతుల కుటుంబాలరకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందచేయాలని అధికారులను ఆదేశించిన షిండే ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News