Friday, November 1, 2024

యువతిని మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Constable arrested for cheating on young womanమన్సూరాబాద్: యువతి ప్రేమిస్తున్నానని పెళ్లిచేసుకుందామని మాటలు చెప్పి ఆమెను గర్భవతి చేసిన ఓ అర్బన్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌ను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం… ఛాదర్‌ఘాట్ అజంపుర రాజనర్సింహ్మనగర్ కాలనీకి చెందిన అవులగడ్డ అభిలాష్ కూమార్ యాదవ్ (32) నాగోల్ జైపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా నివసిస్తున్న ఓ యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటాని లోబరచుకుని గర్భవతిని చేశాడు. ఆపై ఆమెకు గర్భస్రావం చేపించిన అనంతరం యువతితో దూరంపెట్టాడు. పెళ్లిచేసుకోమని యువతి ఓత్తిడి తేవడంతో పట్టించుకోవడం లేదు. దీంతో భాదితురాలు ఎల్బీనగర్ ఠాణాలో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.

Constable arrested for cheating on young woman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News