Sunday, November 3, 2024

స్పెయిన్‌లో వరదల బీభత్సం… 62 మంది మృతి

- Advertisement -
- Advertisement -

తీవ్ర దుర్భిక్షం నుంచి ఇంకా సరిగ్గా కోలుకోలేని స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో మంగళవారం నుంచి వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తూర్పు స్పెయిన్‌లో ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 62 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రీజియన్ల నుంచి ఇంకా సమాచారం అందాల్సి ఉంది. అందువల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అనేక మంది గల్లంతయ్యారు. తప్పిపోయిన వారి కోసం డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. వందలాది కార్లు వరదలో కొట్టుకుపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గ్రామాల వీధులు నదులుగా మారాయి. రైల్వేలైన్లు, జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి.

క్యుయెంకా సిటీలో 88 ఏళ్ల వృద్ధురాలు మృతి చెంది ఉండడం కనిపించిందని కేస్టిల్లా లా మంచా రీజియన్ లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయం వెల్లడించింది. దక్షిణ, తూర్పు స్పెయిన్ మధ్య మలాగా నుంచి వాలెన్సియా వరకు విస్తరించిన వెడల్పైన మార్గంలో వరదనీరు బురదతో నిండి వెల్లువెత్తుతోంది. వరద నీటి ప్రవాహం జోరులో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. గృహపరికరాలు, కొయ్య ముక్కలు నీటిలో గిరికీలు కొడుతున్నాయి. ఇళ్లలో చిక్కుకున్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పోలీస్‌లు,సహాయక బృందాలు హెలికాప్టర్లను, రబ్బరు బోట్లను వినియోగిస్తున్నారు. తాము ఎలుకల్లా చిక్కుకుపోయామని, కార్లు, కంటైనర్లు వీధుల్లోని వరదనీటిలో కొట్టుకుని పోతున్నాయని యుటైల్ మేయర్ రికార్డో గబాల్డన్ చెప్పారు.

స్పెయిన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ల నుంచి వెయ్యిమందికి పైగా సైనికులు వరదబాధిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. స్పెయిన్ కేంద్ర ప్రభుత్వం సహాయక కార్యక్రమాలను సమన్వయం చేయడం కోసం క్రైసిస్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజలు ఇళ్లవద్ద సురక్షితంగా ఉండాలని , చెట్లు కూలిపోవడం, వాహనాలు చిన్నాభిన్నం కావడంతో రోడ్లపై ప్రయాణించడం సాధ్యం కాదని వాలెన్సియన్ రీజినల్ ప్రెసిడెంట్ కేర్లోస్ మేజాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News