Wednesday, November 13, 2024

గిరిజన బాలిక సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం

- Advertisement -
- Advertisement -

ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం అవుతున్న గిరిజన బాలిక సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. కుమురం భీం జిల్లా , జైనూరు మండలం, జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ నీట్‌లో ర్యాంక్ తెచ్చుకొని, మంచిర్యాల మెడికల్ కాలేజీ లో ఎంబిబిఎస్‌లో సీటు సాధించింది. అయితే కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక సాయిశ్రద్ద ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమ బిడ్డ చదువుకు సాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

ఈ విషయం సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో వెంటనే డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సాయిశ్రద్ధ కుటుంబాన్ని బుధవారం పిలిపించి, ఆమె చదువుకు కావాల్సిన ఆర్ధిక సాయాన్ని చెక్కు రూపంలో సిఎం రేవంత్ అందజేశారు. ఈ సందర్భంగా సాయిశ్రద్ద, ఆమె కుటుంబ సభ్యులు సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News