- Advertisement -
చివరి రోజు 38.25 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ముంబయి: ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రొవైడర్ జొమాటో ఐపిఓఆఫర్లు అదరగొట్టాయి. మూడు రోజుల పాటు సాగిన ఐపిఓలో చివరి రోజు శుక్రవారం 38.25 రెట్ల సబ్‌స్క్రిప్షన్లు జరిగాయి. రూ.9375 కోట్ల పెట్టుబడుల సేకరణ లక్షంతో జొమాటో ఐపిఓకు వెళ్లింది. బుధవారంనుంచి ఈ ఐపిఓ ఆఫర్లు కొనసాగాయి. జొమాటో 71.92 కోట్ల ఈక్విటీ షేర్లకుగాను 2,751.25 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు వచ్చాయి. వీటిలో రిటైల్ ఇన్వెస్టర్లు 7.45 రెట్లు సబ్‌స్క్రిప్షన్ బిడ్లు దాఖలు చేశారు. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లనుంచి 32.96 రెట్లు బిడ్లు వచ్చాయని జొమాటో ఎక్స్‌చేంజిలకు ఇచ్చిన నివేదికల్లో తెలిపింది. ఇక ఉద్యోగుల సబ్‌స్క్రిప్షన్ 62 శాతం పక్కన పెట్టగా, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు 51.79 రెట్లు సబ్‌స్ర్కైబ్ చేశారు.
Food delivery service provider Zomato IPO offers
- Advertisement -