Friday, November 1, 2024

133 రైతు కుటుంబాలకు పరిహారం

- Advertisement -
- Advertisement -

Compensation to 133 Farmer Families

రూ.6లక్షల చొప్పున అందజేత

ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షలు . ఉత్తర్వులు జారీ చేసిన విపత్తుల నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది. బలవన్మరణాలకు పాల్పడిన 133 రైతు కుటుంబాలకు రూ.7.95 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు నిధుల విడుదలపై విపత్తుల నిర్వహణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లాలో 27 కుటుంబాలకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23 కుటుంబాలకు, నల్గొండలో 17, భూపాపలపల్లి 12, జనగాంలో 10, హన్మకొండ, ములుగు జిల్లాల్లో 9 కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఖమ్మంలో 6, కొత్తగూడెంలో 5, వరంగల్ లో 3. నిజామాబాద్ లో 3 కుటుంబాలకు పరిహారం అందించనుండగా, మహబూబాబాద్, మెదక్, నారాయణపేట జిల్లాల్లో రెండు కుటుంబాలకు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కో కుటుంబానికి పరిహారం అందనుంది. ఈ మేరకు విపత్తుల నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News