Tuesday, May 14, 2024

వారందరికీ 7 రోజుల హోమ్ క్వారంటైన్‌ : కేంద్రం

- Advertisement -
- Advertisement -

7 days quarantine for all international passengers

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. హోమ్ క్వారంటైన్ పై శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికులకు వారం క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విమానాశ్రయంలో కోవిడ్ -19 నెగిటివ్ పరీక్షలు చేసినప్పటికీ, అంతర్జాతీయ ప్రయాణికులందరూ భారతదేశానికి రాగానే 7 రోజుల తప్పనిసరి హోమ్ క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. వారు దేశానికి చేరిన 8వరోజున ఆర్టీ-పీసీఆర్ పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. కాగా, ఇండియాలో ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. 15 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా 1.17 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. కేవలం పదిరోజుల వ్యవధిలోనే 13 రేట్లు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News