Sunday, June 16, 2024

భారత్‌లో కొత్తగా కొవిడ్ కేసుల నమోదు

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే సింగపూర్‌ను కుదిపేస్తున్న కేపీ.1, కేపీ.2 వేరియంట్లు, తాజాగా మనదేశానికి విస్తరించాయి. భారత్‌లో కేపీ.2 వేరియంట్ కేసులు 290. కేపీ.1 వేరియంట్ కేసులు 34 నమోదైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పౌరులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇవన్నీ జేఎన్1 సబ్ వేరియంట్లేనని , వైరస్‌లో మ్యుటేషన్లు సాధారణమేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

ఇండియన్ సార్స్ కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్టియం సభ్యులు ఎప్పటికప్పుడు ఈ వైరస్ సోకిన వారి నుంచి నమూనాలు సేకరిస్తూ దాని ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారని తెలిపింది. కేపీ.1 కేసులు అత్యధికంగా పశ్చిమబెంగాల్ లో 23 నమోదయ్యాయి. కేపీ2 కేసులు మాత్రం ఎక్కువగా మహారాష్ట్ర(148)లో వెలుగు చూశాయి. సింగపూర్‌లో ఈ కొత్త వేరియంట్ల ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ మే5 నుంచి 11 వరకు ఏకంగా 25,900 కేసులు నమోదవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News