Sunday, June 16, 2024

శంభు సరిహద్దు వద్దకు వేలాది రైతులు

- Advertisement -
- Advertisement -

రైతుల ఆందోళన గురువారం 100 రోజులకు చేరుకుంటున్న సందర్భంగా పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌కు చెందిన వేలాది మంది రైతులు శంభు సరిహద్దుల వద్దకు చేరుకుంటున్నారు. ఈ 100 రోజుల నిరసన కాలంలో ప్రాణాలు విడిచిన 22 మంది రైతుల రోసం ప్రత్యేక నివాళి అర్పించడానికి రైతులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. నిరసనకు ప్రతీకగా నిలిచిన 22 ఏళ్ల శుభ్‌ఖరన్ సింగ్‌తోసహా పలువురు అమరులైన రైతుల చిత్రపటాలను శంభూ సరిహద్దుల వద్ద నిలిపిన ట్రాక్టర్ ట్రెయిలర్లు, పండళ్లు, టెంట్ల వద్ద ఏర్పాటు చేశారు. నిరసన క్షేత్రం వద్ద భారీ వేదికను రైతులు ఏర్పాటు చేశారు. సమీపంలో చిన్న చిన్న టెంట్లు అనేకం వెలిశాయి. రైతులు భారీ సంఖ్యలో బుధవారం ఉదయం నుంచే అక్కడకు చేరుకోవడం మొదలైంది. టార్పలిన్ షీట్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లతో ట్రాక్టర్ టెయిలర్లను రైతులు ఇంటిగా మార్చివేశారు.

ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడం, దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో వడగాడ్పులు వీస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సుమారు 40,000 మంది రైతులు రేపటి నిరసన కార్యక్రమానికి హాజరవుతారని రైతు నాయకులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అంరాయం కలగకుండా పంజాబ్ పోలీసులు చర్యలు చేపట్టారు. బుధవారం జరిగే కార్యక్రమానికి సంబంధించిన వ్యూహాన్ని బికెయు(షహీద్ భగత్ సింగ్) హర్యానా అధ్యక్షుడు అమర్‌జీత్ సింగ్ మొహ్రీ, జాట్ నాయకుడు అశోక్ బులారా మంగళవారం చర్చించారు. అనంతరం తమ డిమాండ్లను విలేకరులకు వివరిస్తూ ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఎంఎస్‌పిని నిర్ణయించాలని, రైతులు, వ్యవసాయ కూలీల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, నెలకు రూ. 10,000 సామాజిక భద్రత ఇవ్వాలని, లఖింపూర్ ఖేరీ రైతులకు న్యాయం లభించాలని, ప్రభుత్వ ఖర్చులతో పంటల బీమా కల్పించాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News