Thursday, May 9, 2024

కడుపునిండా అన్నం.. కష్ట సుఖాల్లో భాగస్వామ్యం..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: హరీశ్ రావు ఈయనొక బ్రాండ్, ప్రజా ప్రతినిధులకే ఆదర్శం. పొలిటికల్ సర్కిల్స్ లో ఓ ట్రెండ్ సెట్టర్. అభివృద్ధిని పరుగులెత్తించే క్షేత్ర కార్యసాధకుడు. విలువలకు కట్టుబడే నాయకుడు. అధికారిక, రాజకీయ సమస్యలకు అత్యంత సులభంగా పరిష్కారం చూపే ట్రబుల్ షూటర్. సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా, కాయిన్ బాక్స్ ఎమ్మెల్యేగా, వాట్సాప్ మెస్సేజ్ కు సైతం స్పందించే వ్యక్తిగా పేరు. మొత్తంగా ఆత్మీయ పలకరింపులు.. కష్టాల్లో భరోసాగా నిలిచే వ్యక్తిగా తెలంగాణనే కాదు యావత్ భారతావనికే హరీశ్ రావు సుపరిచితుడు.

తమ వెతలు చెప్పుకునేందుకు సిద్దిపేట నియోజవర్గం, జిల్లా నుంచే కాకుండా తెలంగాణ నలు మూలల నుంచి రోజూ వందల సంఖ్యలో ప్రజలు సిద్దిపేటకు వస్తారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరినీ కలుస్తారు. సమస్యలను సావధానంగా విని పరిష్కారం చూపుతారు. ఆయన లేని సందర్భంలో క్యాంపు కార్యాలయ అధికారులకు, సిబ్బంది తమ దరఖాస్తులను అందజేస్తారు. ఈ క్రమంలో ప్రజలు, ముఖ్యంగా పేదలు పట్టణ హోటల్స్ లలో అధిక డబ్బులు వెచ్చించి భోజనం చేయలేక ఖాళీ కడుపుతోనే సొంత గ్రామాలకు చేరుకుంటారన్న పరిస్థితిని గమనించారు. సిద్దిపేట తన క్యాంపు కార్యాలయం వేదికగా మరో వినూత్న కార్యక్రమం కు శ్రీకారం చుట్టారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే పేద ప్రజలకు ఆకలితో వెళ్ల కూడదని నిర్ణయించి ఉచిత భోజన సౌకర్యం కల్పించి సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు. సోమవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నూతన షెడ్డులో ఉచిత భోజనం సౌకర్యం లాంఛనంగా ప్రారంభించారు.

తమ బాధలు చెప్పుకుని సమస్యలకు పరిష్కారం పొందాలని వచ్చే ప్రజలకే కాకుండా.. క్యాంపు కార్యాలయం వేదికగా ప్రభుత్వ పథకాలైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన లబ్దిదారులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు కోసం వచ్చే పేద ప్రజలకు కుటుంబ పెద్ద కొడుకులా.. ఆత్మీయుడిలా.. కడుపునిండా వేడి వేడి అన్నం వడ్డించే నూతన ఒరవడి సృష్టించారు.సాయం కోరి వచ్చిన వారికి సాయం చేసి పంపుతూనే స్వoత వారీగా చూసుకోవడమే కాదు., తన వద్దకు వచ్చిన వారికి కడుపునిండా అన్నం పెట్టి పంపుతూ.. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే లబ్ధిదారులకు ప్రజాబంధుగా మారారని నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Free food begins at Harish Rao Camp Office in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News