Friday, November 1, 2024

సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు: కాంట్రాక్ట్ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

Thanks to CM KCR: Contract Employees

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కాంట్రాక్ట్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కాలేజీ, రెసిడెన్షియల్ కాలేజీల సంఘాల రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, ఉపాధ్యాయులు ఆదివారం ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో ధన్యవాద సభను ఏర్పాటు చేసి సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞత తెలుపుతామని అన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసిన వారిలో కాంట్రాక్టు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వినోద్, జూనియర్ కళాశాలల లెక్చరర్లు కనక చంద్రం, గాదె వెంకన్న, సురేష్, రమణ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News