Monday, April 29, 2024

ఉద్యోగాల జాతర…

- Advertisement -
- Advertisement -

 

Jobs Notification in Telangana

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో 80,089 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, కాంట్రాక్టు పద్దతిపై వివిధ శాఖలలో పని చేస్తున్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని బుధవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు రాష్ట్ర రైతు బంధు చైర్మన్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలో సిఎం ఛాంబర్‌లో కెసిఆర్‌ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కెసిఆర్ చేసిన ప్రకటన….. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించినట్లు అయిందన్నారు. నేరుగా భర్తీ చేస్తామని ప్రకటించిన ఖాళీలలో రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల ఉద్యోగాలతో పాటుగా రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలలోనున్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థలలో గత ఏడున్నర ఏండ్లలో 1,52,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి, అందులో 1,33,000 ఉద్యోగాల ఎంపిక పూర్తి చేయబడిందన్నారు. మిగతా 19వేల ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ వివిధ స్థాయిలో ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో అన్ని కాటగిరీలలో 10 ఏళ్ళు గరిష్టంగా వయస్సు పెంచినందుకు సిఎం కెసిఆర్‌కు ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంశంగా ప్రత్యేక తెలంగాణ సాధన కొరకు పోరాడిన కెసిఆర్ ఇప్పటికే రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరు అవసరాలను పూర్తి చేశారన్నారు. నిధులకు కొరతలేని రాష్ట్రంగా అన్ని రంగాలలో తెలంగాణను అభివృద్ధి చేశారన్నారు.

ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగుల పాత్ర గణనీయమైనదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ వాసవాన్ని గుర్తించిన రాష్ట్ర సిఎం కెసిఆర్ పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేసి ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ప్రారంభించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానికత ఆధారంగా అమలులోకి తీసుకొచ్చిన నూతన జోనల్ వ్యవస్థ వల్ల 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతంలోని స్థానికులకు తప్పకుండా లభిస్తాయన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,089 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇతర రాష్ట్ర ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా పారదర్శకంగా నిర్వహించబడుతుందన్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ విద్యావంతులు, విద్యార్థులు నిరంతరంగా శ్రమించి పోటీ పరీక్షలకు హాజరై ఎంపిక కావాలని ఆయన కోరారు.

దేశవ్యాప్తంగా నిరుద్యోగం 7.2 శాతం ఉండగా, రాష్ట్రంలో కేవలం 2.2 శాతం మాత్రమే ఉందన్నారు. ప్రతి 5 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఒక పోస్టు ఖాళీగా ఉందని పల్లా అన్నారు. కేంద్ర ప్రభుత్వం లోని వివిధ శాఖలలో, సంస్థలలో దాదాపు 15 లక్షల ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనది. అందువల్ల పాలన సాఫీగా జరగడానికి వెంటనే కేంద్ర ప్రభుత్వ శాఖలలో, సంస్థలలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News