Sunday, September 14, 2025

ఉగ్రవాదులతో పోరాడిన ఆర్మీ వీర జాగిలం “జూమ్‌” మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ వీర జాగిలం జూమ్ మృతి చెందింది. ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూమ్ గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. దక్షిణ కశ్మీర్ లోని తంగ్‌పావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఉన్నట్టు అందిన సమాచారం మేరకు ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంట్లోకి ఆర్మీ డాగ్ జూమ్‌ను పంపించారు.

ఆపరేషన్‌లో ఈ జాగిలం ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసింది. ఈ సమయంలో రెండు తుపాకీ గుండ్లు దాని శరీరం లోకి దూసుకెళ్లాయి. అయినా పోరాటాన్ని కొనసాగించింది. దాని ఫలితం గానే భద్రతాబలగాలు ఉగ్రవాదులను మట్టుపెట్టగలిగాయి. అనంతరం తీవ్రంగా గాయపడిన జూమ్‌ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఇవి కూడా చదవండి

పొరపాటున మంత్రిని చంపేసిన భద్రతా బలగాలు!

కోర్టుల్లో పోలీసులకు బదులు భద్రతాబలగాలు

బలగాలు పూర్తిగా వైదొలగితేనే సరిహద్దుల్లో శాంతి

కశ్మీర్‌కు అదనంగా 10వేల కేంద్రబలగాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News