Tuesday, April 30, 2024

సూదులంటే భయపడేవారికి టీలా తాగే టీకా

- Advertisement -
- Advertisement -

Corona vaccine distribution begins in Shanghai

షాంఘైలో కరోనా టీకాల పంపిణీ ప్రారంభం

బీజింగ్ : చైనా లోని షాంఘై నగరం కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం బుధవారం పీల్చే టీకాలను ఇవ్వడం ప్రారంభించింది. ఈ విధమైన టీకాలను ఇవ్వడం ప్రపంచం లోనే మొదటిసారి. ఇదివరకు కరోనా టీకాలు పొందింన వారికి ఉచితంగా బూస్టర్‌డోసుగా ఈ పీల్చదగిన టీకాను ఇస్తున్నారు. కఠినమైన ఆరోగ్యవ్యవస్థలున్న దేశాలకు ఈ సూదులు లేని టీకాలు చాలా అనుకూలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. భుజానికి ఇంజెక్షన్ ఎక్కించడం ఇష్టం లేని వారికి ఈ పీల్చే టీకాలు సౌలభ్యంగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం అమలవుతున్న కరోనా ఆంక్షలు సడలించే లోగా అత్యధిక శాతం మందికి ఈ బూస్టర్‌డోసులు అందివ్వాలని చైనా ప్రభుత్వం యోచిస్తోంది. అక్టోబర్ నెల మధ్యనాటికి చైనా జనాభాలో 90 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్లు పొందగలిగారు. 57 శాతం మంది బూస్టర్ డోసు పొందారు.

కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో చిన్న నాళం కలిగిన తెల్లని కప్పు ప్రజలు నోటిదగ్గర ఉంచుకున్నట్టు వీడియో దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది ఒకవిధమైన టీ తాగినట్టు ఉంటోందని షాంఘైకు చెందిన ఒకరు వీడియోలో వెల్లడించారు. దాన్ని పీల్చగానే కొంచెం తియ్యగా అనిపించిందని చెప్పారు. ఈ టీకా పెద్ద చుక్కలు నోటిని, గొంతును వైరస్ నుంచి కాపాడగా, చిన్న చుక్కలు శరీరం లోని ఇతర భాగాలకు వెళ్తాయని భారత్ లోని ఇమ్యునాలజిస్టు డాక్టర్ వినీతాబాల్ పేర్కొన్నారు. చైనా రెగ్యులేటర్లు సెప్టెంబరులో బూస్టర్ డోసుగా వినియోగించడానికి ఈ నోటి వ్యాక్సిన్‌ను ఒప్పుకున్నారు. చైనా బయోఫార్మాక్యూటికల్ కంపెనీ కెన్‌సినో బయోలాజిక్స్ ఈ నోటి టీకాను రూపొందించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News