Thursday, September 18, 2025

పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదం.. మంటల్లో చిక్కుకుని నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Fuel Tanker Catches Fire In Mizoram

ఐజ్వాల్: మిజోరాంలోని ఐజ్వాల్ జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో ఓ మహిళ సహా నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 18 మంది గాయపడినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఐజ్వాల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సి. లాల్రుయాయా మాట్లాడుతూ… తుయిరియాల్ ఎయిర్‌ఫీల్డ్ సమీపంలో శనివారం రాత్రి 20,000 లీటర్ల పెట్రోల్‌తో చంఫాయ్ వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురై మంటలు చెలరేగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయిల్ ట్యాంకర్ నుంచి లీకైన పెట్రోల్‌ను సేకరించేందుకు బాధితులతో పాటు స్థానికులు ప్రయత్నించారు. ఆయిల్ మంటల్లో నలుగురు వ్యక్తులు చనిపోయారు. 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులలో చేర్చాము. అగ్నిప్రమాదంలో మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ట్యాక్సీ దగ్ధమైనట్లు లాల్రుయాయా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News