Friday, April 26, 2024

మాండౌస్ తుఫానుకు తమిళనాడులో నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: మాండౌస్ తుఫాను శనివారం తమిళనాడు కోస్తా పట్టణం మామల్లాపురంలో నేలను తాకింది. గంటకు 6575 కిమీ. వేగంతో గాలులు వీచాయి. దాంతో వందలాది చెట్లు విరిగిపడ్డాయి. తమిళనాడులో నలుగురు మృతి చెందారు. అల్పపీడనం నేలను తాకి బలహీనపడ్డానికి దాదాపు ఐదు గంటలు పట్టింది. దాదాపు 400 చెట్లు విరిగిపడ్డాయి. వాటిలో కొన్ని 100 ఏళ్లకు మించిన చెట్లు కూడా ఉన్నాయి. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ శకలాలు వగైరా తొలగించి నగరాన్ని తిరిగి నార్మల్సికి తేవడానికి పెద్ద ఎత్తున నడుం బిగించింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను తిరిగి పునరుద్ధరించారు.

చెన్నైలోని నుంగామ్‌బక్కమ్, మీనామ్‌బక్కమ్‌లో రికార్డు స్థాయిలో 10 సెమీ. వర్షపాతం నమోదయింది. 24 గంటలపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వానలు శనివారం ఉదయం 8.30కు ఆగాయి. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టులలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వానలు కురిసాయి. తరుత్తనిలో 10 సెమీ., షోలింగనల్లూరులో 7.2 సెమీ., పాడుర్‌లో 10.8 సెమీ., పూనమల్లీలో 9.9 సెమీ. వాన కురిసింది. తీవ్ర అల్పపీడనం క్రమంగా పశ్చిమ వాయవ్యపశ్చిమ దిశగా కదిలి శనివారం మధ్యాహ్నంకల్లా బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

తుఫాను ఘటనల కారణంగా కనీసం నలుగురు చనిపోయారని రెవెన్యూ మంత్రి కెకెఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ తెలిపారు. విద్యుత్తు వైర్లు మీదపడ్డంతో ఇద్దరు విద్యుద్ఘాతానికి లోనై చనిపోయారని, మరి ఇద్దరు గోడకూలగా చనిపోయారని వివరించారు. “విధ్వంసానికి సంబంధించి పూర్తి వివరాలను మేము శనివారం సాయంత్రంకల్లా ఇస్తాం” అని ఆయన చెప్పారు. ఇదిలావుండగా సైదాపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తు న్న ఎంఎ. సుబ్రమణ్యన్ దాదాపు 400 చెట్లు కూకటి వేళ్లతో విరిగిపడ్డాయని, వాటిని శనివారం సాయంత్రం కల్లా తొలగించడం జరుగుతుంది” అని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలను సమీక్షించారు.

తుఫాను మామల్లాపురంలో నేలను తాకినందున 121 మంది సిబ్బందితో మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను చెంగల్పట్టు జిల్లాలో మోహరించారు. నాగపట్నం, తంజావూరు, తిరువరూర్, కడలూరు, మైలాడుతురై, చెన్నై, తిరువరూర్, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురంలో 14 జాతీయ ప్రకృతి విపత్తు ప్రతిస్పందన బృందాలను ఇదివరకే పంపించారు. అరక్కోణంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ కంట్రోల్ రూమ్ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News