Friday, May 3, 2024

మాజీ ప్రేయసిపై కోపంతో వరుడి ఇంటికి నిప్పు

- Advertisement -
- Advertisement -

సింగపూర్: తాను ప్రేమించిన యువతి తనను కాదని వేరే వ్యక్తితో వివాహం చేసుకుంటోందన్న కోపంతో సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ఒక యువకుడు ఆమె పెళ్లి చేసుకుంటున్న వరుడు నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ఎదుట నిప్పుపెట్టి విధ్వంసం సృష్టించినందుకు అతనికి సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. తాను చేసిన తప్పులను ఒప్పుకున్నందుకు నిందితుడు సుఏంద్రన్ సుకుమారన్‌కు విధించిన శిక్షను కోర్టు ఏడేళ్ల నుంచి ఆరు నెలలకు తగ్గించినట్లు స్ట్రెయిట్స్ టైమ్స్ పత్రిక శుక్రవారం తెలిపింది. మొహమ్మద్ అజ్లీ మొహమ్మద్ సల్లే అనే వ్యక్తిని తన మాజీ ప్రేయసి మరుసటి రోజు పెళ్లి చేసుకుంటున్న విషయంఈ ఏడాది మార్చి 11న ఇన్‌స్టాగ్రాంలో చూసిన సుకుమారన్ పెళ్లికొడుకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకుని అతడిని ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

వరుడు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని 12వ అంతస్తుకు అర్ధరాత్రి చేరుకుని అతడి ఫ్లాట్ బయట గ్రిల్ గేటుకు తాళం వేసి నిప్పు పెటాడు. ఉదయం బయటకు వచ్చి చూసిన వరుడికి తగలబడి పోయిన షూస్, ఇతర వస్తువులతోపాటు గేటుకు తాళం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి సిసి కెమెరాల సాయంతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. మంటలు ఇతర ఫ్లాట్స్‌కు వ్యాపించి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని అభిప్రాయపడిన న్యాయమూర్తి నిందితుడు పాల్పడిన నేరాన్ని తీవ్రంగా పరిగణించారు. అతడికి ఏడేళ్ల గిరష్ఠ కారాగార శిక్ష విధించారు. అయితే నేరాన్ని ఒప్పుకుని క్షమాపణలు కోరడంతో అతడికి విధించిన శిక్షాకాలన్ని తగ్గిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News