Tuesday, April 30, 2024

కోవోవాక్స్ బూస్టర్ డోస్ మార్కెట్ అనుమతి?

- Advertisement -
- Advertisement -
ఔషధ నియంత్రణ సంస్థకు సీరం దరఖాస్తు

న్యూఢిల్లీ : తాము ఉత్పత్తి చేసిన కోవిడ్ 19 వ్యాక్సిన్ కోవోవాక్స్‌కు బూస్టర్ డోస్‌గా మార్కెట్‌లో పంపిణీకి అధీకృత అనుమతిని ఇవ్వాలని పుణేకు చెందిన సీరం ఇనిస్టూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) అభ్యర్థించింది. ఈ మేరకు దేశంలోని భారత ఔషధ నియంత్రణల నిర్ణయాధికారిక సంస్థ (డిసిజిఐ)కు నిర్ధేశిత నిబంధనల ప్రకారం అప్పీలు చేసింది. 18 సంవత్సరాలు పైబడ్డ వారికి దీనిని బూస్టర్ డోస్‌గా వాడేందుకు అనుమతిని కోరింది. దేశంలో వయోజనులకు ఇప్పటికైతే కోవిషీల్డ్ , కోవాగ్జిన్ రెండు డోస్‌ల టీకాలు అందుతున్నాయి.

పలు వేరియంట్ల నేపథ్యంలో బూస్టర్ డోస్ అవసరం ఏర్పడింది. దీనిని మార్కెట్ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తాము రూపొందించిన కోవోవాక్స్‌కు అనుమతిని మంజూరు చేయాలని తాము కోరినట్లు ఈ ఔషధ సంస్థకు చెందిన నియంత్రణ విషయాలు, ప్రభుత్వలావాదేవీల వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ విలేకరులకు తెలిపారు. అక్టోబర్ 17వ తేదీనే తాము కోవోవాక్స్‌కు సంబంధించి మార్కెట్ అథరైజేషన్ దరఖాస్తును డ్రగ్స్ కంట్రోటర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిసిజిఐ)కు పంపించినట్లు వివరించారు.ఈ మధ్యకాలంలో అధీకృత సంస్థ నుంచి ఈ ఔషధ సంస్థకు కొన్ని సందేహాలను పంపించింది.

వీటిని నివృత్తి చేస్తూ తాము వివరణలు ఇచ్చుకున్నామని , ఇప్పుడు తలెత్తిన సరికొత్త వేరియంట్ల దశలో బూస్టర్ డోస్ అవసరం ఉందని, తాము మార్కెట్ చేసుకునేందుకు అధికారికంగా అనుమతి త్వరలోనే దక్కుతుందని ఆశిస్తున్నామని సింగ్ తెలిపారు. ఈ ఏడాది జూన్‌లోనే ఏడు నుంచి పదకొండు సంవత్సరాల మధ్యలోని పిల్లల్లో నియంత్రణలతో కూడిన అత్యవసర వాడకానికి ఈ కోవోవ్యాక్స్‌కు డిసిజిఐ అనుమతిని వెలువరించింది. సీరం ఇనిస్టూట్ కోవోవాక్స్‌కు సంబంధించిన వ్యాక్సిన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని నోవావాక్స్ నుంచి సంతరించుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News