Tuesday, April 30, 2024

నేటి నుంచి సెకండరీ మార్కెట్‌కు యుపిఐ సేవలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) జనవరి 1న సెకండరీ మార్కెట్ కోసం యుపిఐ(యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) సేవలను ప్రారంభించనుంది. దీంతో పెట్టుబడిదారులు యుపిఐ ద్వారా చెల్లించి షేర్లను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఐపిఒ(ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్) బిడ్డింగ్‌లో యుపిఐ ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఐపిఒ కోసం దరఖాస్తు చేసినప్పుడు, పెట్టుబడిదారుడి ఖాతాలో డబ్బు బ్లాక్ చేస్తారు, షేర్లు జారీ చేసినప్పుడు మొత్తం డెబిట్ అవుతుంది.

అదేవిధంగా సెకండరీ మార్కెట్‌లో ఈ సేవ ప్రారంభించిన తర్వాత కొనుగోలు చేసిన షేర్ల మొత్తం మీ ఖాతాలో బ్లాక్ అవుతుంది. దీని తర్వాత అదే రోజు సెటిల్‌మెంట్ జరిగినప్పుడు పెట్టుబడిదారుల ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుంది. క్లియరింగ్ కార్పొరేషన్లు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలు, స్టాక్‌బ్రోకర్లు, బ్యాంకులు, యుపిఐ యాప్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీల సహకారంతో ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ కోసం బీటా వెర్షన్‌లో చెల్లింపు సేవను ప్రవేశపెట్టనున్నట్లు ఎన్‌పిసిఐ తెలిపింది. ప్రారంభంలో ఈ సేవ పరిమిత వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్‌లు మొదట ఈ సేవను పొందుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News