Saturday, May 4, 2024

కశ్మీర్‌లో హిమపాతం షురూ!

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో హిమపాతం మొదలయింది. వాతావరణ అధికారుల ప్రకారం కనీస ఉష్ణోగ్రత పెరిగినప్పటికీ లడఖ్‌లో, కశ్మీర్‌లో మాత్రం ఇంకా సబ్‌జీరో కన్నా కిందే ఉష్ణోగ్రత ఉంది. ‘శ్రీనగర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 3.2 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. అంటే గత రాత్రి కన్నా 1.1 డిగ్రీల సెల్సియస్ మేరకు పడిపోయింది’ అని వాతావరణ శాఖ పేర్కొంది. కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో…ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలలో, లడఖ్‌లో గురువారం కొత్త హిమపాతం మొదలయింది. రాబోయే 24 గంటల్లో మరింత హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొకెర్‌నాగ్, అనంత్‌నాగ్ జిల్లాలోని మరో రిసార్టు వద్ద ఉష్ణోగ్రత మైనస్ 2.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కశ్మీర్ కు పర్యాటకులుగా వచ్చిన వారు మంచులో ఆడుకుంటూ ఆనందిస్తున్నారు కూడా. ఒకరిపై మరొకరు మంచు విసురుకుంటూ ఆటలాడుకుంటున్నారు. పర్యాటకులు మంచులో ఆనందిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News