Tuesday, April 30, 2024

పిండి కోసం పెనుగులాట

- Advertisement -
- Advertisement -

సబ్సిడీ గోధుమ పిండి కోసం
తొక్కిసలాట.. ఒకరు మృతి
పాక్‌లో దుర్భర పరిస్థితులకు
అద్దం ఆకాశాన్నంటిన ధరలు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో జనజీవితాన్ని మరింత అతలాకుతలం చేసేలా గోధుమ , బియ్యం పిండి ధర లు ఆకాశాన్ని అంటాయి. పలు ప్రాంతాల్లో ప్రజల ఆ హారానికి అత్యవసరం అయిన ఈ పిండ్ల ధరలు కిలో కు రూ.140 నుంచి రూ 16౦కు చేరుకున్నాయి. దే శంలో చాలా నెలల నుంచి తీవ్రస్థాయిలో ఉన్న ఆర్థిక సంక్షోభం జనంపై పిడుగుపాట్లకు దారితీసింది. వి ద్యుత్ కోతలు, ఇంధన కొరతతో దైనందిన జీవితానికి ఇక్కట్లు ఏర్పాడ్డాయి. కాగా నిత్యావసర సరుకులను రేషన్ ద్వారా పంపిణీ చేసే  సమయంలో పలు చోట్ల తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో సింధ్ ప్రాంతంలోని మిర్పూర్ఖాస్‌లో రేషన్ షాపు వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి ఊపిరి ఆడక మృతి చెందాడు.

ఖైబర్ ఫక్తూన్‌క్వా, సింధు, బెలూచిస్థాన్ ప్రాంతాలలో నిత్యావసర సరుకులకు కటకట ఏర్పడింది. రేషన్ షాపుల వద్ద వేలాదిగా జనం గంటల తరబడి క్యూలు కట్టి ఉన్నారు. చాలా సేపటి తరువాత వచ్చే సరుకుల వ్యాన్లు చూడగానే ప్రజలు దూసుకువెళ్లడంతో తీవ్ర స్థాయిలో గందరగోళం నెలకొంటోంది. ట్రక్కులను నిలిపివేసి , సరుకును తీసుకువెళ్లేందుకు జనం యత్నించిన ఘటనలు జరిగాయి. దీనితో పలు ప్రాంతాలలో వ్యాన్లకు వెంబడి భద్రతా సిబ్బందిని కాపలాగా పెట్టారు. గోధుమల ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉండే కరాచీలో ఇప్పుడు గోధుమ పిండి ధరలు ఏకంగా కిలోకు రూ 16ం స్థాయికి చేరాయి.

ఇస్లామాబాద్, పెషావర్‌లలో పది కిలోల ఆటా సంచి ధరలు ఏకంగా రూ 1500 పైగా పల్కుతున్నాయి. 20 కిలోల బ్యాగు రూ 2800కు చేరింది. తమ ప్రాంతంలో సరకుల నిల్వలు పూర్తిగా అడుగంటిపొయ్యాయని బెలూచిస్థాన్ ఆహార మంత్రి జమారక్ అచాకజీ తెలిపారు. వెంటనే 4 లక్షల వరకూ గొధుమల సంచులు అవసరం అని లేకపోతే సంక్షోభం మరింత ముదురుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖైబర్ ప్రాంతంలో 20 కిలోల గోధుమ పిండి ధర ఏకంగా రూ 3800 వరకూ చేరింది . సింధ్ ప్రాంతంలో 40 ఏండ్ల కూలీ హర్‌సింగ్ కొల్హీ రేషన్‌షాపు వద్ద జరిగిన తొక్కిసలాట క్రమంలో కింద పడ్డాడు. పలు చోట్ల మహిళలు, పిల్లలు కింద పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News