Tuesday, April 30, 2024

కుక్క దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః నగరంలో కుక్కల స్వైర విహారం కొనసాగుతూనే ఉంది. సోమవారం బోరబండ, మధురానగర్‌లో మరో ఇద్దరు చిన్నారులను కుక్క కాటుకు గురైన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈసారి స్థానిక పెంపుడు కుక్క ఆ చిన్నారులపై దాడి చేసి గాయపర్చింది. 8 ఏళ్ల ఆయాన్‌తోపాటు 5 ఏళ్ల అమ్మాయి ఈ కుక్క దాడిలో గాయపడ్డారు. దీంతో వారి కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం సేవలను అందించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న జిహెచ్‌ఎంసి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వీధిలో తిరుగుతున్న కుక్కలను పట్టుకునేందుకు బృందాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఎండకాలంలో కుక్కలకు సరైన తిండి, నీళ్లు లేక అవి మురికి నీరు తాగడంతోపాటు కుళ్లిన ఆహార పదార్థలు తిన్నడంతో కుక్కల మానసిక స్థితి కోల్పొవడం ద్వారా మనుషులపై దాడికి తెగబడుతాయన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కుక్కల ను వెంటనే కట్టడి చేయాలని లేకపోతే కుక్కకాటుతో గాయ పడ్డ బాలుడితీసుకుని వచ్చి జిహెచ్‌ఎంసి కార్యాలయాన్ని ముట్టడిస్తామని బోరబండ వాసులు అధికారులను హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News