Tuesday, April 30, 2024

‘రామబాణం’ నుంచి భైరవిగా డింపుల్ హయాతి పరిచయం

- Advertisement -
- Advertisement -

మాచో  హీరో గోపీచంద్ , దర్శకుడు శ్రీవాస్ కలిసి రెండు బ్లాక్‌ బస్టర్‌ లను అందించారు. ఇప్పుడు వారి మూడో చిత్రం ‘రామబాణం’తో హ్యాట్రిక్ పూర్తి చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.గోపీచంద్ కు జోడిగా డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తోంది. హోలీ, మహిళా దినోత్సవ సందర్భంగా సినిమా నుంచి డింపుల్ హయాతీ పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఎత్నిక్ వేర్‌లో అద్భుతంగా కనిపించిన డింపుల్..  భైరవి గా స్టైల్‌ గా ఎంట్రీ ఇచ్చింది. మిక్కీ జె మేయర్ ఈ వీడియోకి అద్భుతమైన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ చేశాడు.

ఈ చిత్రంలో జగపతి బాబు, ఖుష్బు..  గోపీచంద్ అన్నా వదినల పాత్రలు పోషిస్తున్నారు. సోషల్ మెసేజ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించిన బలమైన కథాంశంతో రూపొందిన చిత్రం రామబాణం. అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్  సంగీతం అందిస్తున్నారు. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్. ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాసర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 5న రామబాణం విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం: గోపీచంద్, డింపుల్ హయతీ, జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: శ్రీవాస్

నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సంగీతం: మిక్కీ జె మేయర్

డీవోపీ: వెట్రి పళనిసామి

ఎడిటర్: ప్రవీణ్ పూడి

కథ: భూపతి రాజా

డైలాగ్స్: మధుసూదన్ పడమటి

ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె

పీఆర్వో: ఎల్ వేణుగోపాల్, వంశీ-శేఖర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News