Friday, September 19, 2025

28న లోక్‌సభ సభాపతి ఆసనం వద్ద రాజదండాన్ని ఉంచనున్న ప్రధాని మోడీ!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తాజా సమాచారం ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ భారత కొత్త పార్లమెంట్ భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా మరచిపోయిన, పాతిపెట్టిన చరిత్రను పునరుద్ధరించడం కూడా జరుగుతుంది. మే 28న చారిత్రక బంగారు రాజదండాన్ని స్పీకర్ సీటు వద్ద ప్రధాని స్థాపించనున్నారు. రాజదండాన్ని తమిళంలో ‘సెంగోల్’ అంటారు. అది భారత దేశ ఆవిర్భవం సందర్భంగా చారిత్రక ప్రత్యేకతను కలిగి ఉంది. 1947లో అధికారం బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు బదిలీ అయినప్పుడు ఈ రాజదండానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News